'RRR' కోసం ఆలియా అన్ని కోట్లు తీసుకుంటుందా ?

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 Alia Bhatt Remuneration For Rrr-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి ఈ సినిమాలో వీళ్ళను రాజమౌళి ఎలా ప్రెసెంట్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.ఈ సినిమాతో ఆలియా తెలుగు తెరకు పరిచమవ్వ బోతుంది.

 Alia Bhatt Remuneration For Rrr-RRR’ కోసం ఆలియా అన్ని కోట్లు తీసుకుంటుందా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని తెలుగు కూడా నేర్చుకుంటుంది.అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఈ సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఆలియా రోజుకు 50 లక్షలు తీసుకునేలా అగ్రిమెంట్ కుదుర్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఆమె పాత్రను రెండు వారాల్లో పూర్తి చేయాలనీ రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట.ఈ సినిమాకు మొత్తంగా ఆలియా 6 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Alia Bhatt, Alia Bhatt Remuneration, Alia Bhatt Remuneration For Rrr, Ntr, Rajamouli, Ram Charan, Rrr-Movie

ఇది ఇలా ఉంటె ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో నటిస్తుంది.ఈమె నటన కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.

#Ram Charan #Alia Bhatt #AliaBhatt #Rajamouli #AliaBhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు