డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆ బాలీవుడ్ ప్రేమికులు

బాలీవుడ్ లో ప్రేమ జంటలకి కోడవేలేదు.అయితే ఎవరు, ఎప్పుడు, ఎవరితో రిలేషన్ లో ఉంటారు అనేదని గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించొద్దు.

 Alia Bhatt Ranbir Kapoor December-TeluguStop.com

ఎందుకంటే అక్కడ ఈ మధ్య కాలంలో కనిపించే రిలేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు మారిపోతుంది.హీరో, హీరోయిన్స్ తమ ప్రేమికులని ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు.

ఏది ఏమైనా బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ గా చేసి పెళ్లితో ఒకటైన జంటలు ఎక్కువగా ఉంటాయి.ఇప్పుడు వారి బాటలోనే బాలీవుడ్ స్టార్ కిడ్స్, ప్రేమికులు అయిన అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లితో ఒకటి కావడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే వీరిద్దరి రిలేషన్ స్టేటస్ కి రెండు, మూడు సార్లు మార్చుకొని ఇప్పుడు ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారు.ఎక్కడికి వెళ్ళిన ప్రేమ పక్షులు మాదిరి కలిసి వెళ్ళడం, కలిసి రావడం చేస్తున్నారు.

ఇప్పటికే తాము ఒకరితో ఒకరు ఘాడమైన ప్రేమలో ఉన్నామనే విషయాన్ని చాలా సందర్భాలలో క్లారిటీ ఇచ్చేశారు.ఇదిలా ఉంటే ఈ ఏడాది వీరిద్దరు పెళ్లితో ఒకటి కావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలలో వినిపిస్తుంది.దీనికి సంబంధించిన కోలమన్‌ మ్యాగజైన్ ఒక వార్త ప్రచురించారు.ఈ ఏడాది ఆలియా, రణబీర్‌ వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది.వీరిద్దరూ కలసి నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ విడుదల అయిన వెంటనే వీరి వివాహం ఉంటుందని చెబుతుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది వారిద్దరు చెప్పేంత వరకు సస్పెన్స్ గానే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube