ఇంకా తేల్చని ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. ఎప్పటికి ఓకే అంటుందో..?  

Alia Bhatt Not Ready For Shootings, Alia Bhatt, RRR, Bollywood News, Shooting, Tollywood News - Telugu Alia Bhatt, Bollywood News, Rrr, Shooting, Tollywood News

కరోనా వైరస్ కారణంగా సినిమా రంగానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.మూడు నెలలకు పైగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినిమా రంగానికి చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Alia Bhatt Not Ready For Shootings

దీంతో భారీ బడ్జెట్ చిత్రాల దగ్గర్నుండి చిన్న చిత్రాల వరకు అందరూ తమ సినిమాలు తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతాయా అని చూస్తున్నారు.కాగా టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియాడికల్ మూవీలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తుండగా హీరోయిన్లుగా ఒలివియా మారిస్, ఆలియా భట్ నటిస్తున్నారు.అయితే రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది.

ఇంకా తేల్చని ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. ఎప్పటికి ఓకే అంటుందో..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముంబైలో కరోనా వైరస్ విజృంభన తారా స్థాయిలో ఉండటం, ఇటు హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఏర్పడటంతో ఆలియా ఇప్పట్లో షూటింగ్‌లలో పాల్గొనబోదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

కాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆలియా భట్ కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే పలుమార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతూ వస్తుండటంతో జక్కన్న అండ్ టీమ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు మరోసారి ఆలియా భట్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుండటంతో ఆమె ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.మరి ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ ఎప్పుడు జాయిన్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

#Alia Bhatt #RRR #Shooting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alia Bhatt Not Ready For Shootings Related Telugu News,Photos/Pics,Images..