తెలుగు పాఠాలు నేర్చుకుంటున్న అలియా భట్

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష మీద పట్టు సాధించి సొంతగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నారు.దీనికి గాను ముందు నుంచే ఆ బాషలో ప్రావీణ్యం సాధించడానికి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా పెట్టుకుంటున్నారు.

 Alia Bhatt Learn Telugu For Rrr Movie, Tollywood, Bollywood, Telugu Cinema, Sout-TeluguStop.com

కొంత మంది భామలు ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యి సొంతగా డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు.ఈ వరుసలో ఎక్కువగా వినిపించే పేర్లు నిత్యా మీనన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్,నివేథా థామస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.

అయితే వీళ్ళ లిస్టులోకి చేరడానికి అలియా భట్ కూడా సిద్ధం అవుతుంది.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడానికి దక్షిణాది భాషల మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.డైలాగ్ కి తగ్గట్లు ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలన్నా మీనింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి.

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఒకే డైలాగ్ ని అన్ని భాషలలో చెప్పే సామర్ధ్యం ఉండాలి.ఇలా చేయాలంటే దక్షిణాది భాషలన్నింటిలో డైలాగ్ అర్ధం తెలిసి ఉండాలి.

ఈ విషయం గ్రహించిన అలియా ఇప్పటి నుంచి స్పెషల్ గా దక్షిణాది బాషల మీద పట్టు ఉన్న ట్రైనర్ ని పెట్టుకొని బాషలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా తెలుగు బాష నేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని, సొంతగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తుంది.

త్వరలో తెలుగులో మాట్లాడేయాలని ఈ అలియా తెగ ఆరాటపడుతోందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube