చిన్న పిల్లల బట్టల వ్యాపారం మొదలు పెట్టిన అలియా భట్  

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సినిమాలతో పాటు సైడ్ వ్యాపారాలు కూడా చేస్తున్నారు.క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే పాత సామెతకి కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు.

TeluguStop.com - Alia Bhatt Launches Her Own Label Of Kids Clothing

చేతిలో నిండుగా ఉన్న డబ్బులని ఏదో ఒక వ్యాపారంలో పెడుతున్నారు.అయితే చేసే వ్యాపారాలు కూడా ఏదో రెగ్యులర్ కి కాకుండా కచ్చితంగా ప్రాఫిట్ ఉండే బిజినెస్ ల మీద పెట్టుబడులు పెడుతున్నారు.

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, సమంత లాంటి స్టార్స్ బట్టల వ్యాపారాలు మొదలు పెట్టారు.వీరి దారిలో పాయల్ రాజ్ పుత్ కూడా చేరిపోయి కొత్తగా ఫాషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది.

TeluguStop.com - చిన్న పిల్లల బట్టల వ్యాపారం మొదలు పెట్టిన అలియా భట్-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే రకుల్ అయితే ఫిట్ నెస్ సెంటర్ స్టార్ట్ చేసింది.అలాగే బాలీవుడ్ భామలు కూడా ఇలా సైడ్ వ్యాపారాలతో బాగానే సంపాదిస్తున్నారు.

ఇప్పుడు వీరి దారిలోకి మరో బాలీవుడ్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కూడా వచ్చి చేరింది.

ఈ భామ కొత్తగా బట్టల వ్యాపారం మొదలు పెట్టింది.అయితే రెగ్యులర్ గా అందరి దారిలో వెళ్తే కొత్తదనం ఏముందిలే అని అనుకుందేమో.బట్టల వ్యాపారం అయినా అలియా స్టార్ట్ చేసింది చిన్న పిల్లల బట్టలు వ్యాపారం.

అలియా చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం వ్యాపారం ప్రారంభించడంతో పాటు అందులో ఎవరైనా పార్ట్నర్స్ గా చేరడానికి కూడా ఆహ్వానం పలుకుతుంది.ఆసక్తి ఉన్న వారు తన కంపెనీలు పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపింది.

ఎడ్ ఏ మమ్మా పేరుతో చిన్నపిల్లల దుస్తుల వ్యాపారానికి సంబందించిన అవుట్ లెట్స్ ని కూడా అలియా స్టార్ట్ చేయబోతుంది.మరి ఈ అమ్మడు బట్టలకి మార్కెట్ లో ఎంత వరకు గిరాకీ లభిస్తుంది అనేది చూడాలి.

#Alia Bhatt #Celebrities #CelebritySide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alia Bhatt Launches Her Own Label Of Kids Clothing Related Telugu News,Photos/Pics,Images..