నవంబర్ 2న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొననున్న అలియా భట్  

Alia Bhatt Join RRR Shooting In November Second, Tollywood, Bollywood, South Cinema, Pan India Movie, Ram Charan, Rajamouli, Jr NTR - Telugu Alia Bhatt, Alia Bhatt Join Rrr Shooting In November Second, Bollywood, Jr Ntr, November Second, Pan India Movie, Rajamouli, Ram Charan, South Cinema, Tollywood

లాక్ డౌన్ తర్వాత కొద్ది రోజుల క్రితం మరల ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఎన్టీఆర్ కి సంబంధించి కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

TeluguStop.com - Alia Bhatt Join Rrr Shooting In November Second

ఇకపై రెగ్యులర్ షూటింగ్ ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడానికి జక్కన్న సిద్ధం అవుతున్నాడు.గ్యాప్ లేకుండా షూటింగ్ జరగనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆమె రామరాజు భార్యగా ఈ సినిమాలో కనిపించబోతుంది.

TeluguStop.com - నవంబర్ 2న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొననున్న అలియా భట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నవంబర్ 2 నుంచి ఆమె ఆర్ఆర్ఆర్ షూటింగ్ సెట్ లో పాల్గొంటుంది అని తెలుస్తుంది.ఆమెకి సంబందించిన సన్నివేశాలు మొత్తం రాజమౌళి పూర్తి చేయబోతున్నాడు.

రామ్ చరణ్ కాంబినేషన్ లో అలియా భట్ కి సంబంధించి కీలక సన్నివేశాలు షూటింగ్ చేయాల్సి ఉంది.వీటిని నవంబర్ 2 నుంచి హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ క్యారెక్టర్ టీజర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయ్యింది.ఈ టీజర్ కి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే కొమరమ్ భీం పాత్రని తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఆయనని ముస్లిం గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం రాజమౌళి చేస్తున్నాడని, చరిత్రని వక్రీకరిస్తున్నాడని విమర్శలు మొదలు పెట్టారు.అయితే జక్కన్న టీం నుంచి ఈ విమర్శలపై ఎలాంటి స్పందన లేదు.

గతంలోనే తాను చెప్పబోయేది ఒక కల్పిత కథ అని, కేవలం పాత్రలని స్ఫూర్తిగా తీసుకొని ఆర్ఆర్ఆర్ కథని సిద్ధం చేసుకున్నాను అని క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో ఈ విమర్శలని పట్టించుకోకుండా జక్కన్న షూటింగ్ లో ముందుకి వెళ్ళిపోతున్నాడు.

#Pan India Movie #AliaBhatt #Rajamouli #Jr NTR #November Second

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alia Bhatt Join Rrr Shooting In November Second Related Telugu News,Photos/Pics,Images..