అలియా భట్ అలాంటిది.. రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో  స్టార్ హీరో హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో రణబీర్ కపూర్, అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమికులు అనే విషయం మనకు తెలిసిందే .

 Alia Bhatt Is Like That Ranbir Kapoor Interesting Comments Details,  Alia Bhatt,-TeluguStop.com

పలు కారణాల వల్ల గత ఏడాది వివాహం చేసుకోవాల్సిన ఈ జంట వీరి వివాహాన్ని ఈ ఏడాది పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.ఇకపోతే తాజాగా రణబీర్, అలియా కలిసి నటించిన బ్రహ్మాస్త్రం సినిమా త్వరలోనే విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే  ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ జంట ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.

ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ అలియాభట్ ఒక తుఫాను అని, అదే విధంగా ఆమె ఫైర్ క్రాకర్ అని కూడా ఆమె పై కామెంట్ చేశారు.

ఆమె కోపం లో ఉన్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి అంటూ అలియా గురించి రణబీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అలియా కూడా రణబీర్ పై పొగడ్తల వర్షం కురిపించింది.

నేను పెద్ద తుఫాను అయితే ఆ తుఫానులో కామ్‌గా ఉండే ‘సూపర్‌పవర్’ అతనంటూ మురిసిపోయింది.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరూ ఒకరిపై మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Alia Bhatt, Aliabhatt, Bollywood, Brahmastra, Ranbir Kapoor-Movie

ప్రస్తుతం రణబీర్ కపూర్ అలియా గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే రెండు రోజుల క్రితం వరకు RRR ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో బిజీగా ఉన్న అలియా భట్ ఆ సినిమా విడుదల వాయిదా పడిందని తెలియగానే పూర్తిగా తన దృష్టిని బ్రహ్మాస్త్ర సినిమాపై పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన ప్రియుడు రణబీర్ తో కలిసి పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube