ఆర్ఆర్ఆర్ కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ!  

ఆర్ఆర్ఆర్ కోసం అలియా బట్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసిన జక్కన్న. .

  • టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో తారక్, రామ్ చరణ్ కాకుండా మిగిలిన ఆర్టిస్ట్స్ విషయంలో రాజమౌళి గోప్యత పాటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇందులో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నాడని టాక్ మాత్రమె బయటకి వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లలో ఒకరిని కీలక పాత్ర కోసం రంగంలోకి దించడానికి జక్కన్న రెడీ అవుతున్నాడని టాక్ వినిపించింది.

  • ఇదిలా వుంటే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా బట్ ని జక్కన్న ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో జరిగే లార్జ్ షెడ్యూల్ లో ఆమె యూనిట్ లో భాగం అవుతుందని సమాచారం. ఇండియన్ మార్కెట్ ని ద్రుష్టిలో వుంచుకొని రాజమౌళి ఈ సినిమా కోసం తమిళ నటులతో పాటు, బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాతో సాధించాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి బాహుబలి రికార్డ్స్ ని ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.