విజయ్ దేవరకొండకి పడిపోయిన బాలీవుడ్ బ్యూటీ అలియా

టాలీవుడ్ ప్రస్తుతం క్రేజీ హీరోగా యూత్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ.అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో ఎవరికి రానటువంటి క్రేజ్ విజయ్ కి వచ్చింది.

 Alia Bhatt Intresting Comments On Vijaya Devarakonda-TeluguStop.com

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్లో గీత గోవిందం ఇలాంటి సూపర్ హిట్ చిత్రం పడటంతో పాటు తెలుగులో చిన్న హీరోల చిత్రాలలో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రికార్డును సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన లుక్స్, మేనరిజం, స్టైల్స్ తో బాలీవుడ్ మీడియాని కూడా తన వైపుకి లాక్కున్నాడు.

ప్రస్తుతం అమ్మాయిల కలల రాకుమారుడిగా విజయ్ దేవరకొండ బాగా పాపులర్ అయిపోయాడు.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో బాలీవుడ్ తారలతో కలిసి సందడి చేశాడు.

డు ఇక ఇప్పటికే జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ స్టైల్ కి ఫిదా అయిపోయారు.ప్రస్తుతం ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న అలియా భట్ కూడా చేరింది.తాజాగా ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న అలియా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.ఈ ఏడాది ఫ్యాషనబుల్ స్టార్ ఎవరు అని మీడియా అడిగిన అని ఆలోచించకుండా విజయ్ దేవరకొండ అని చెప్పింది.

విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని, ఇది అతనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచాయని చెప్పింది.మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube