ఆలియా భట్ ఇండస్ట్రీకి పరిచయం అయినపుడే అనుకుందంటా  

రాజమౌళితో సినిమా చేయడం నా డ్రీం అంటున్న అలియా భట్. .

Alia Bhatt Interesting Comments On Rajamouli-

బాలీవుడ్ భామలు సౌత్ సినిమాలలో నటించినపుడు, అలాగే తమ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు సౌత్ సినిమాల మీద తమకి ఎంతో ఇష్టం ఉన్నట్లు, అవకాశం వస్తే సౌత్ సినిమాలో కచ్చితంగా చేస్తా అంటూ కలరింగ్ ఇవ్వడంతో పాటు, సౌత్ ఇండస్ట్రీ చాలా మంచి సినిమాలని తెరకేక్కిస్తుంది అంటూ మాటలు చెబుతూ ఉంటారు. అయితే మళ్ళీ ఈ భామలె నార్త్ లో సౌత్ సినిమాల గురించి, ఇక్కడి దర్శకులు, హీరోల గురించి తక్కువ చేసి మాట్లాడుతారు. సౌత్ లో గ్లామర్ తప్ప నటనకి ప్రాధాన్యత ఉండదని విమర్శలు చేస్తూ ఉంటారు..

ఆలియా భట్ ఇండస్ట్రీకి పరిచయం అయినపుడే అనుకుందంటా-Alia Bhatt Interesting Comments On Rajamouli

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో బాలీవుడ్ భామకి కూడా సౌత్ సినిమాపైన అలాగే తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. తనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం అని, అన్ని భావాలని చక్కగా పలికించగలిగే భాష తెలుగు అంటూ కొత్త పలుకు అందుకుంది. ఇదంతా ఎందుకు అంటే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.

రామ్ చరణ్ కి జోడీగా ఆమె పాత్ర ఉంటుంది.

ఇక ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడానికి అలియా రెడీ అయిపోతుంది. అలాగే తాను ఇండస్ట్రీలోకి వచ్చినపుడు కచ్చితంగా ముగ్గురు దర్శకులతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా అని, అందులో రాజమౌళి ఒకరని చెప్పింది. ఈ కారణంగానే ఆయన తన పాత్ర గురించి చెప్పగానే మరేం ఆలోచించకుండా ఒకే చెప్పేసా అని చెప్పింది.

మొత్తానికి ఈ భామ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవకదానికి మాటలు భాగానే చెబుతుంది అంటూ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.