రణబీర్ తో బ్రేక్ అప్ పై అలియా ఆసక్తికరమైన ట్వీట్

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Alia Bhatt Gives Clarity On Her Relation Status With Ranbir-TeluguStop.com

వరుసగా మూడు పెద్ద ప్రాజెక్ట్ లలో నటిస్తుంది.ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇక ఈ భామ చాలా రోజులుగా బాలీవుడ్ ప్లే బాయ్ గా చెప్పుకునే రణబీర్ కపూర్ తో డేటింగ్ లో ఉందని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.ఈ విషయంపై రణబీర్ తండ్రి కూడా క్లారిటీ ఇచ్చేసాడు.

ఇక వీరు ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని టాక్ వినిపించింది.అందుకు తగ్గట్లుగానే ఇరు కుటుంబాల వారు పెళ్లి పనులు మొదలెట్టారని కూడా చర్చించుకున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి బ్రేక్ అప్ చెప్పుకున్నారని టాక్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

ఆ మధ్య కాలంలో ఆలియా పోస్ట్ చేసిన ఫోటోల్లో రణ్‌బీర్ కపూర్ లేకపోవడంతో వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారా అంటూ కొంత నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు.

ఇక కొన్ని మీడియా సంస్థలు మరో అడుగు ముందుకేసి రణబీర్ కి అలియా బ్రేక్ అప్ చెప్పేసింది అంటూ కొన్ని కారణాలు, గతంలో అతని ప్రవర్తన గురించి కూడా వార్తలు వండి వార్చేశారు.అయితే తాజాగా ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది.

ఆ ఫోటోను రణ్‌‌బీర్ కపూర్ తీసాడని కామెంట్ చేసింది.దీంతో రణ‌్‌బీర్‌తో బ్రేేకప్ చెప్పారంటూ వస్తోన్న వార్తలపై ఆలియా చాలా సింపుల్ గా ఒకే ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి చిన్నదైన అలియా ఆలోచన మాత్రం చాలా పెద్దది అని మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube