ఇండియాలో ఏ హీరోయిన్‌ చేయని పని 'ఆర్‌ఆర్‌ఆర్‌' హీరోయిన్‌ చేసింది

ధనవంతులు తమ ఇంట్లో పని చేసే వారికి, తమ కార్ల డ్రైవర్లకు పండుగ సమయంలో బహుమానాలు ఇవ్వడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.కొందరు జీతాలు ఇవ్వడమే ఎక్కువ, ఇంకా బహుమానాలు కూడానా అనే వారు కూడా ఉన్నారు, ఆ విషయం పక్కన పెడితే బాలీవుడ్‌ సంచలన తార, స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ తన ఇంట్లో పని చేసే పని మనిషికి మరియు తన కారు డ్రైవర్‌కు ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే బహుమానాలు ఇచ్చింది.

 Alia Bhatt Gifts Driver And Helper Rs 50 Lakh Cheques To Buy A House-TeluguStop.com

ఇప్పటి వరకు ఇండియాలో ఏ సెలబ్రెటీ ఇంత భారీ స్థాయిలో బహుమానాలు ఇచ్చి ఉండదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీ ఫ్యామిలీ వారు అయినా ఈ స్థాయిలో డబ్బులు తమ పని వారి కోసం ఖర్చు చేసి ఉండరు అంటూ సోషల్‌ మీడియాలో ఆలియా భట్‌ గురించి అనుకుంటూ ఉన్నారు.

చిన్న తనంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి పాతిక సంవత్సరాల వయసులోనే పది కోట్లకు పైగా పారితోషికం దక్కించుకుంటున్న ఆలియా భట్‌ సంవత్సరంలో రెండు మూడు సినిమాలు నటిస్తూ యాడ్స్‌ ఇతరత్ర ఆదాయాలతో సంవత్సరంలో 50 కోట్లకు పైగా సంపాదిస్తుంది.అలాంటి ఆలియా తన పని వారికి కోటి రూపాయలు సాయం చేయడం జరిగింది.

వందల కోట్లు సంపాదిస్తున్న వారు కూడా లక్షల్లో సాయం చేసేందుకు వెనుక ముందు ఆలోచిస్తారు.కాని ఆలియా మాత్రం తన కోసం చాలా కష్టపడుతున్న ఈ ఇద్దరి కోసం ముంబయిలోని ఒక ఖరీదైన ఏరియాలో సింగిల్‌ బెడ్‌ రూం ఇల్లను కొనుగోలు చేసి ఇచ్చింది.ఇంత భారీ మొత్తంలో ఆలియా వారికి బహుమానాలు ఇవ్వడం టాక్‌ ఆఫ్‌ ది ఇండియా అయ్యింది.ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోవడంతో పాటు తాజాగా మన జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఒక హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెల్సిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఆలియా 12 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube