చరణ్ బ్యూటీ సినిమాకు వంద కోట్ల డీల్?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

 Alia Bhatt Gangubai Kathiawadi 100 Cr Deal, Alia Bhatt, Rrr, Ram Charan, Netflix-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరోలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆలియా భట్ నటిస్తున్న ఓ సినిమా సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయ్ కతియావాడి’ అనే సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అత్యంత భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను ఏకంగా రూ.100 కోట్ల భారీ డీల్‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్‌లో డిజిటల్ రైట్స్ డీల్ రావడం నిజంగా విశేషమని చెప్పాలి.కాగా ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్ హక్కులతో చిత్ర నిర్మాతలు భారీ లాభాలను గడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఏదేమైనా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అంశం ప్రస్తుతం ఇతర సినిమాలకు సవాల్ విసురుతుండటంతో తమ సినిమాలపట్ల స్టార్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్‌లో ఈ బ్యూటీ సీత పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.మరి చరణ్ సరసన ఈ బ్యూటీ ఎలా సెట్ అవుతుందో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube