అఫిషియల్‌: 'ఆర్ఆర్‌ఆర్‌' నుండి సీత ఫస్ట్‌ లుక్‌ రాబోతుంది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అద్బుత దృశ్య కావ్యం ఆర్‌ఆర్ఆర్‌ సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతున్నాయి.ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

 Alia Bhatt First Look From Ntr Ram Charan Rrr Movie , Alia As Sita, Alia Bhatt,-TeluguStop.com

వచ్చే నెలలో సినిమా కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్‌ చరణ్‌ ను మరియు కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్ ను పరిచయం చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా రామ్ చరణ్‌ కు జోడీగా నటిస్తున్న సీత పాత్ర ఆలియా ను పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఈ నెల 15వ తారీకున ఆర్ఆర్ఆర్‌ నుండి ఆలియా లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

మార్చి 15వ తారీకున ఆలియా పుట్టిన రోజు జరుపుకోబోతుంది.ఆమె పుట్టిన రోజు అభిమానులకు మరింత జోష్‌ ను కల్పించేందుకు గాను ఆలియా భట్ లుక్ ను ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీమ్‌ విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో ఆలియా భట్ నటించడం పట్ల మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.ఆలియా సీత పాత్రకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆలియా బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గ ఆ వెలుగు వెలుగుతుంది.అలాంటి సమయంలో ఆమె ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో రావడం వల్ల సినిమాకు ఖచ్చితంగా హైప్ వస్తుందని జక్కన్న అండ్ టీమ్‌ భావిస్తున్నారు.

ఆలియా లుక్‌ విడుదల తర్వాత సినిమా పై మరింతగా అంచనాలు పెరిగేనేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube