అవార్డు ఫంక్షన్ లో రెచ్చిపోయిన ప్రేమజంట

బాలీవుడ్ లో ప్లే బాయ్ గా నిజజీవితంలో కూడా చాలా మంది భామలతో రొమాన్స్ చేస్తున్న హీరో రణబీర్ కపూర్.ఈ కుర్ర హీరో మనసు ఇప్పుడు అలియా భట్ మీద పడింది.

 Alia Bhatt Declares Love For Ranbir Kapoor At Awards Show-TeluguStop.com

ఇంకేముంది అనుకున్నదే తడువుగా లైన్ లో పెట్టేసాడు.ఇక ఆమె కూడా రణబీర్ తో డేటింగ్ మొదలెట్టేసింది.

ఇప్పుడు ఈ ఇద్దరు చెట్టాపట్టాల్ వేసుకొని తెగ తిరిగేస్తూ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు.ఈ మధ్యకాలంలో ఈ జంట మరింత స్పీడ్ పెంచి పబ్లిక్ లో రెచ్చిపోతుంది.

తాజాగా అవార్డ్ ఫన్క్ష లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన చూసి అందరూ నోరెళ్లబెట్టారు.

జీ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా రణబీర్ అలియా జంట ప్రత్యేకంగా అందరికి ఆకర్షించింది.

అలియా, రణబీర్ కపూర్, దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ లు అందరూ ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక అరుదైన సంఘటన చోటు జరిగింది.రాజీ చిత్రంలో నటనకు అలియా ఉత్తమ నటిగా ఎంపికయినట్టు ప్రకటించారు.

దీంతో ఎగ్జైట్ అయిన రణబీర్ పక్కనే కూర్చొని ఉన్న అలియాను దగ్గరగా తీసుకొని పెదవుల మీద ముద్దివ్వబోయాడు.దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై అతని నుంచి తప్పించుకుంది.

దీంతో వెంటనే రణబీర్ అలియా బుగ్గపై ముద్దుపెట్టాడు.దానికి సిగ్గుపడిన అలియా వెంటనే తమాయించుకొని మళ్ళీ రణబీర్ సింగ్ బుగ్గపై ప్రేమగా ముద్దిచ్చింది.ఇక ఈ ముద్దులతో ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగిపోయాయి.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఇంత పబ్లిక్ గా ముద్దుల వర్షం కురిపించుకున్న ఈ జంట ఎంత కాలం ఇలా రిలేషన్ లో ఉంటారో చూడాలని బీటౌన్ లో చర్చించుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube