మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: ఆలియాభట్

ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం కానుంది.

 Alia Bhatt Covid Negative And Back Work After Isolating, Alia Bhatt, Corona Viru-TeluguStop.com

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆలియా భట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే తను మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు అంటూ పంచుకుంది.

ఇదిలా ఉంటే ఆలియా భట్.సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న “గంగూ భాయ్ కథియావాడీ” సినిమాలు లీడ్ రోల్ లో నటిస్తుంది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉండగా డైరెక్టర్ భన్సాలీ కు మంగళవారం కరోనా పాజిటివ్ రాగా‌.మరో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కి కూడా అదే రోజున కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇక అలియా నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడికి, తన ప్రియుడికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలనుకుంది.

ఈ విధంగా తాను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.

డాక్టర్ సలహా మేరకు ఆమె కరోనా పరీక్ష చేయించుకోగా నెగటివ్ అని తేలిందని, గురువారం నుంచి షూటింగ్ లో పాల్గొంటానని తెలిపింది.మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు అంటూ కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఉన్నానని, మీరు కూడా అలాగే ఉండండి అంటూ తెలిపింది.

ఇక ఈమె ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉండగా కరోనా కోసం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలనుకున్న ఆలియా కు నెగటివ్ రావడంతో ఇప్పుడు ఈ సినిమాకు డేట్ కు ఎలాంటి వాయిదా లేదని అర్థమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube