ఈ ఫోటోలో సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్ ని గుర్తు పట్టండి చూద్దాం...

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ “అలియా భట్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “మహేష్ భట్” తనయురాలు అయినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని తనకంటూ కొద్దిమంది అభిమానులను సంపాదించుకుంది.

 Alia Bhatt Adorable Looking In Selfie Taking, Alia Bhatt, Alia Bhatt Selfie Taki-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ తదితర చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటిస్తూ దూసుకుపోతోంది.

అయితే ఈ మధ్య అలియా భట్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన పలు ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తు ఉంటుంది.కాగా తాజాగా అలియా భట్ అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీసిన ఫోటో ని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో ఈ అమ్మడు ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 12 లక్షల పైచిలుకు మంది నెటిజన్ల లైక్ చేశారు.అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలయిన కత్రినా కైఫ్, మలైకా అరోరా మరియు ఇతర సెలబ్రెటీలు సూపర్ అంటూ కామెంట్లు చేశారు.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో “సీత” పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్రకు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా మంచి స్పందన లభించింది.

కాగా “గంగు బాయి ఖైత్వదే” అనే మరో హిందీ చిత్రంలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అక్కినేని నాగార్జున తదితర స్టార్ హీరోలు నటిస్తున్న “బ్రహ్మాస్త్ర” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube