ఆ షో కు మంచు విష్ణు అందుకే వచ్చాడా.. ట్రోల్ అవుతున్న కమెడియన్ అలీ!

బుల్లి తెరపై అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఆలీతో సరదాగా.తాజాగా ఈ కార్యక్రమానికి ఈ వారం మంచు విష్ణు అతిథిగా వచ్చారు.

 Comedian Ali Show Alitho Saradaga Manchu Vishnu Episode Time Extended, Alitho Sa-TeluguStop.com

ప్రస్తుతం ఇండస్ట్రీలో మా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది నేపథ్యంలో ఈ విధంగా మంచు విష్ణు ఈ కార్యక్రమానికి తీసుకురావడం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు అలీ మంచు విష్ణును ఈ కార్యక్రమానికి ఎందుకు తీసుకువచ్చాడు? పబ్లిసిటీ కోసమే మంచు విష్ణును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా అంటూ పలువురు నెటిజన్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో గత వారం విడుదల చేయడంతో చాలా మంది ఈ కార్యక్రమంపై దృష్టిసారించారు.ఇకపోతే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మంచు విష్ణు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎపిసోడ్ యూట్యూబ్ లో విడుదల చేశారు.అయితే విడుదల చేసిన కొద్దిసేపటికి ఈ వీడియోను డిలీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu Alitho Saradaga, Youtube, Maa, Manchu Vishnu, Tollywood, Uploaded-Movie

ఈ విధంగా డిలీట్ చేసిన కొంత సమయానికి ఈ వీడియో కంటెంట్ నిడివిని పెంచుతూ మరి పోస్ట్ చేయడంపై ప్రేక్షకులు కొంత మేర గందరగోళానికి గురయ్యారు.
అసలు ఈ విధంగా డిలీట్ చేస్తూ అప్లోడ్ చేయడానికి కారణం ఏమిటి? మా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విష్ణు ఈ కార్యక్రమానికి రావడం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Alitho Saradaga, Youtube, Maa, Manchu Vishnu, Tollywood, Uploaded-Movie

ఈ క్రమంలోనే మంచు విష్ణును హైలెట్ చేయడం కోసం మా ఎన్నికలలో విష్ణుకి బూస్టప్ ఇవ్వడం కోసం అలీ ఈ కార్యక్రమానికి విష్ణును ఆహ్వానించారా అంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డిలీట్ చేయడం ఆ తర్వాత అప్లోడ్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే చేశారా లేకపోతే సాంకేతిక సమస్యల కారణంగా ఈ విధంగా చేశారా అనే విషయం తెలియడం లేదు.ఏదిఏమైనప్పటికీ అలీ విధంగా చేయడంపై నెటిజన్లు దారుణంగా తనని ట్రోలింగ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube