అలీని చూపించు చూపించు అంటే చూపించాడు, దూల తీరింది  

Ali Reza Nominated For Directly About Foul Game-ali Reza,baba Baskar,bigg Boss Telugu3,rahul Cipligunj,srimukhi,varun Sandesh

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌కు చేరింది.వచ్చే వారంతో ఈ సీజన్‌ పూర్తి కాబోతుంది.నిన్న మరియు మొన్నటి ఎపిసోడ్‌లో ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌ జరిగాయి.ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉండగా ఒక్కరు మాత్రం విన్నర్‌గా నిలిచి అయిదుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతారు అంటూ బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు.చార్జ్‌ యువర్‌ బ్యాటరీ పేరుతో సాగిన ఈ టాస్క్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.

Ali Reza Nominated For Directly About Foul Game-ali Reza,baba Baskar,bigg Boss Telugu3,rahul Cipligunj,srimukhi,varun Sandesh-Ali Reza Nominated For Directly About Foul Game-Ali Baba Baskar Bigg Boss Telugu3 Rahul Cipligunj Srimukhi Varun Sandesh

మొన్నంతా కూడా అలీ ఫైనల్‌కు వెళ్లి పోతాడు అంటూ అంతా అనుకున్నారు.ఫైనల్‌ అవకాశాలు అద్బుతంగా ఉన్న అలీ అనవసర ప్రయత్నం చేసి ఫైనల్‌ రేసు నుండి ఎలిమినేట్‌ అయ్యాడు.

Ali Reza Nominated For Directly About Foul Game-ali Reza,baba Baskar,bigg Boss Telugu3,rahul Cipligunj,srimukhi,varun Sandesh-Ali Reza Nominated For Directly About Foul Game-Ali Baba Baskar Bigg Boss Telugu3 Rahul Cipligunj Srimukhi Varun Sandesh

అలీ రీ ఎంట్రీ తర్వాత ఫిజిల్‌ టాస్క్‌లు ఇవ్వలేదు.టాస్క్‌ల్లో మళ్లీ అలీని చూడాలని ఉంది అంటూ అంతా అనుకున్నారు.దాంతో బాబా బాస్కర్‌తో ఫిజికల్‌ టాస్క్‌ వచ్చింది.వచ్చిందే అవకాశం, నన్ను ఫిజికల్‌ టాస్క్‌లు బాగా ఆడాలని కోరుకుంటున్నారని, అందుకే ఈ టాస్క్‌లో దుమ్ము రేపాలని అలీ భావించినట్లుగా ఉన్నాడు.

అందుకే బాబా భాస్కర్‌ను ఫిజికల్‌గా హ్యాండిల్‌ చేశాడు.బాబా భాస్కర్‌పై ఏకంగా దాడికే దిగాడు.దాంతో ఒకసారి బిగ్‌బాస్‌ హెచ్చరించాడు.

హెచ్చరించిన తర్వాత కూడా అలీ అలాగే ఆట కొనసాగించాడు.దాంతో బిగ్‌బాస్‌ టాస్క్‌ను రద్దు చేశాడు.ఈ టాస్క్‌ను రద్దు చేయడంతో పాటు అలీని ఫినాలే రేసు నుండి తప్పిస్తున్నట్లుగా ప్రకటించాడు.ఆ తర్వాత గేమ్స్‌ కొనసాగాయి.అలీ తర్వాత స్థానంలో ఉన్న రాహుల్‌కు అదృష్టం కలిసి వచ్చి శ్రీముఖిపై గెలవడంతో టాప్‌లో నిలిచాడు.

దాంతో ఈ సీజన్‌ మొదటి ఫైనలిస్ట్‌గా రాహుల్‌ నిలిచాడు.ఫిజికల్‌గా తన సత్తా చూపేందుకు ప్రయత్నించిన అలీకి దూల తీరింది.