గుడ్ న్యూస్ చెప్పిన అలీ రెజా.. త్వరలోనే వారి జీవితంలోకి?

తెలుగు సినీ నటుడు, బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.నటుడిగానే కాకుండా మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Ali Reza Tells Good News Into Their Lif Soon Ali Reza, Actro, Good News, Big-TeluguStop.com

ఈయన తెలుగుతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించాడు.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు అలీ రెజా.

ఇదిలా ఉంటే తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు అలీ.

తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆతర్వాత 2014లో అమృతం చందమామలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.కానీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు.ఇక ధ్రువ సినిమాలో నటించగా ఇందులో తన పాత్రతో మెప్పించాడు.ఇటీవలే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో కూడా నటించగా ఇందులో అలీ రెజా నటనకు మంచి ప్రశంసలు అందాయి.

Telugu Actro, Ali Reza, Bigg Boss, Serial, Socail, Wild Dog-Movie

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక 2019లో స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం అందుకొని అందులో తనేంటో తాను నిరూపించుకున్నాడు.ఈ షోతో మరింత పాపులారిటీ పెంచుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

Telugu Actro, Ali Reza, Bigg Boss, Serial, Socail, Wild Dog-Movie

ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటాడు.అంతేకాకుండా తన భార్యతో కలిసి చేసిన వీడియోలను కూడా పంచుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో పంచుకోగా అందులో తన భార్య గర్భవతిగా కనిపించింది.దీంతో మొదట పెళ్లి గెటప్ తో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత బేబీ బంప్ తో వీడియో చేశారు.

ఈ వీడియో చూడగానే నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.ఇక త్వరలోనే వీరి జీవితంలోకి ఓ బేబీ అడుగుపెట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube