జగన్ పాలన పై పొగడ్తలు వర్షం కురిపించిన ఆలీ..!!

2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా కమెడియన్ ఆలీ చాలాచోట్ల ప్రచారం నిర్వహించడం తెలిసిందే.ఆ సమయంలో ఇండస్ట్రీ నుండి ఆలీ అదేరీతిలో పోసాని కృష్ణ మురళి, మోహన్ బాబు వంటి నటీనటులు వైసీపీకి మద్దతుగా కీలకంగా ప్రచారంలో పాల్గొన్నారు.

 Ali Praises Ysrcp Governament In Rajamahendravaram , Ys Jagan, Ali, Rajamahendra-TeluguStop.com

ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలీకి ఖచ్చితంగా ఏదో ఒక పదవి గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.కానీ ఇప్పటివరకు వైసీపీ హైకమాండ్ ఎటువంటి పదవి ఇవ్వలేదు.

అయినా కానీ ఎప్పటికప్పుడు వైసీపీకి అందుబాటులో ఉంటూ ఆలీ తనదైన శైలిలో రాణిస్తున్నారు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ రామ్…నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

ఇదే క్రమంలో ఆన్లైన్ టికెట్ విధానం విషయంలో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశించారు.ఈ విషయం పై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని హామీ కూడా ఇచ్చారు అని ఆయన అన్నారు.

ఇక ఇదే సమయంలో సొంత ఊరిలో కేఎల్ యు డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉందని.ఆలీ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube