రెండేళ్ల క్రితం పెళ్లి.. ఇప్పుడు రెసెప్షన్.. ఆ సెలెబ్రిటీ జంట ఎవరంటే?

సెలెబ్రిటీలు అన్ని రహస్యంగానే సాగిస్తారు.వీరి లవ్ ఎఫైర్స్, వివాహాలు అన్ని కూడా అభిమానులకు ఎప్పుడు పెద్ద న్యూస్ గానే ఉంటాయి.

 Ali Fazal-richa Chadha Wedding In Pandemic Time Now Receptions, Ali Fazal, Richa-TeluguStop.com

ఎంత వారు రిలేషన్స్ ను దాచాలని ప్రయత్నించినా అవి ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి.మరి ఈ క్రమంలోనే రిచా చద్దా, అలీ ఫజల్ జంట నడుమ రిలేషన్ ఉందని.

వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి.ఎప్పుడు కూడా వీరు బయట పెట్టలేదు.

కానీ కరోనా మహమ్మారి సమయంలో ఈ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది.అది కూడా వీరు బయటకు చెప్పడంతో తెలిసింది.అప్పట్లో క్రైసిస్ కారణంగా వీరు ఘనంగా పెళ్లి చేసుకోలేక పోయారు..

కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల కోసం రెండేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని గ్రాండ్ గా వారి వివాహ రెసెప్షన్ కు పెట్టనున్నారు.ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో వివాహ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

వివాహ రెసెప్షన్స్ పార్టీలను ఢీల్లీ లక్నో లో నిర్వహించారు.ఈ రోజు రాత్రి ముంబై లో ఫైనల్ ఈవెంట్ ను సినీ పరిశ్రమలోని స్నేహితుల కోసం నిర్వహిస్తున్నారు.

మరి ఈ వేడుకకు కూడా భారీగా సెలెబ్రిటీలు రాబోతున్నారు.రెండేళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నట్టు అధికారికంగా వెల్లడించారు.ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలు అంటూ మరోసారి హడావిడి చేయడంతో వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

రిచా చద్దా, అలీ ఎవరికీ వారు కెరీర్ లో బిజీగానే ఉన్నారు.రిచా బోల్డ్ క్యారెక్టర్స్ చేసి బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది.ఈమె షకీలా బయోపిక్ లో నటించి మెప్పించింది.

ఆ తర్వాత పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యింది.ఇలా ఎవరికీ వారు బిజీగా ఉన్న తమ ఫ్యామిలీ కోసం స్నేహితుల కోసం మరోసారి పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు.

రెండున్నరేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి వేడుకలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube