దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ తరుణంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో అత్యవసర లాక్ డౌన్ ని విధించిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో ప్రజలకు అవసరమైన అత్యవసర సదుపాయాలు తప్ప మిగిలిన ఏ ఇతర సదుపాయాలు అందుబాటులో లేకుండా మూసివేశారు. దీంతో ప్రజలు తాము నివాసం ఉన్నటువంటి ఇళ్లకే పరిమితమయ్యారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం ముంబై నగర పరిసర ప్రాంతంలో తన కార్ కి పోలీసులు ఉపయోగించేటటువంటి ఎమర్జెన్సీ సైరన్ ని తగిలించుకొని రోడ్లలోపై విచ్చలవిడిగా షికారు చేశాడు.అంతేగాకా షికారు చేస్తున్న సమయంలో వీడియోని తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో పోలీసులు అతడిని కనిపెట్టే పనిలో పడ్డారు.అయితే ఇందులో భాగంగా ఆ వ్యక్తి ముంబై నగరంలో ఓ ప్రముఖ రెస్టారెంట్ ఓనర్ అని అతడి పేరు అలీ కూలర్ అని పోలీసులు తెలుసుకున్నారు.
దీంతో వెంటనే పోలీసులు అలీ కూలర్ ని అదుపులోకి తీసుకున్నారు.అంతేగాక అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి విచారణ నిమిత్తమై పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అయితే పోలీసులు మాత్రం ప్రజలను అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన ఇతర సమయాల్లో బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు.అంతేగాక ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అనవసరంగా రోడ్ల మీద సమాచారం చేస్తే అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపిస్తామని హెచ్చరించారు.
ఇంకో పది రోజులపాటు ఈ లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడితే ఈ కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.