ఎన్నికల ప్రచారంలో జగన్ పాలన పై ఆలీ కామెంట్స్..!! 

2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయిన ఆలీ .జగన్ పార్టీ తరఫున కీలక ప్రాంతాలలో ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మైనార్టీ వర్గాలు బలంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో వైసీపీ తరఫున కమెడియన్ ఆలీ ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు.ఈ తరుణంలో రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమెడియన్ ఆలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ పాలన పై సంచలన కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మేనిఫెస్టోలో ఉన్నా ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని పేర్కొన్నారు.రాష్ట్రంలో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఓటు వెయ్యాలి అని పిలుపునిచ్చారు.

పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఆలీ ఆ తర్వాత భవానిపురం దగ్గరకు వెళ్లి అక్కడ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వై.యస్ మాదిరిగానే జగన్ పాలన ఉన్నట్లు రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 

.

#YS Jagan #Vijaywada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు