ఆ ఆలస్యమే వారికి చేటు తెస్తోందా ?

ఆలస్యం అమృతం విషం అనే అనే నానుడి ఊరికే పుట్టలేదు.మనం చేసే ఆలస్యం ఒకసారి మనకి మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు.

 Ali And Mohan Babu Not Get Any Nominated Post To Ycp Party-TeluguStop.com

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తమ హవా చూపిస్తూ అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల విషయంలోనూ వారు చేసిన లేటు వారికి పదవులు రాకుండా అడ్డు పడుతోంది.

Telugu Ali Mohan Babu, Pruthvi-

ఆ ఇద్దరే మంచు మోహన్, బాబు సినీ కమెడియన్ ఆలీ.ఏపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కుతాయని అందరూ భావించారు.మోహన్ బాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దక్కుతుందని ఊహాగానాలు కూడా అప్పట్లో చెలరేగాయి.

Telugu Ali Mohan Babu, Pruthvi-

అలాగే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కీలక పదవి ఏదో ఒకటి ప్రభుత్వం తరఫున దక్కుతుందని అనుకున్నారు.కానీ అనూహ్యంగా జగన్ థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ పృథ్వి కి ఎస్వీబీసీ చైర్మన్, విజయ్ చందర్ కు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే వైసిపి ఎమ్మెల్యే సినీ నటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ గా పదవులు కట్టబెట్టాడు.దీంతో ఇద్దరిలోనూ మరింత కంగారు మొదలైంది.

Telugu Ali Mohan Babu, Pruthvi-

జగన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న ప్రతిసారి మోహన్ బాబు, ఆలీ పేర్లు తెర మీదకు రావడం సాధారణం అయిపోయింది.అయితే మొదటి నుంచి తన మీద నమ్మకంతో తన వెంట నడిచిన వారికే ముందుగా పదవులు ఇచ్చి వారికి గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నాడు.ఇంకా ఆ వరుసలో పోసాని కృష్ణ మురళి ఉన్నాడు.

అయితే ఆయన పదవి కోసం పెద్దగా ఆశ పడుతున్నట్టు కనిపించడం లేదు.అందుకే ఆయన పదవి విషయంలో పెద్దగా ఎవరూ స్పందించడంలేదు.

ఇక ఇప్పుడు నడుస్తున్న చర్చంతా ఆలీ, మోహన్ బాబు మీదే.వారు వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసే మద్దతుగా ప్రచారం చేసినా ఎందుకు వారికి పదవులు రాలేదు అనే చర్చ ప్రధానంగా నడుస్తోంది.

Telugu Ali Mohan Babu, Pruthvi-

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొందిన వారందరూ మొదటి నుంచి జగన్ వెంట నడిచారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పోరాడుతూ మద్దతు తెలిపారు.కానీ ఆలీ, మోహన్ బాబు విషయానికి వస్తే, వారు ఎన్నికల ముందు మాత్రమే వైసీపీలో చేరారు.అంతకుముందు టిడిపి, బిజెపి, జనసేన ఇలా అనేక పార్టీలను వారు ఛాయస్ గా పెట్టుకుని ఆఖరికి వైసీపీలో చేరారు.

Telugu Ali Mohan Babu, Pruthvi-

ఇదే వారికి ఇప్పుడు మైనస్ గా మారిందట.ఎన్నికల ముందు వచ్చిన వారి కంటే తాను కష్ట కాలంలో ఉన్నప్పటి నుంచి తనతో ఉన్నవారికి ముందు పదవులు ఇచ్చి, ఆ తరువాత మిగతా వారికి చూద్దాంలే అన్నట్టుగా జగన్ భావిస్తూ ఉండడంతో మోహన్ బాబు, ఆలీకి పదవుల విషయంలో ఆలస్యం జరగడానికి కారణం అవుతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube