అమెజాన్ అలెక్సా ని గురించి గుండె పనితీరు చెప్పమంటే వామ్మో ఏకంగా

అమెజాన్ అలెక్సా గురించి అందరికీ తెలిసిందే.అది ఎలాంటి సమాచారం అయినా కూడా ఇట్టే ఇచ్చేసి అద్భుతం సృష్టిస్తుంది.

 Alexa Comments About Human Heart Beat-TeluguStop.com

ఈ రోజుల్లో చాలా మంది అలెక్సా కు బానిసలుగా మారిపోయారు.ఒక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుండడం తో అందరూ కూడా అలెక్సా కు కనెక్ట్ అయిపోతున్నారు.

చివరికి ఇంటికి సంబందించిన అన్ని పనులకు కూడా ఈ కృత్రిమ మేధస్సు ఉన్న అలెక్సా ను కనెక్ట్ చేసి పనులను చేసుకుంటున్నారు.అయితే అలాంటి అలెక్సా వల్ల ఒక మహిళకు ఊహించని షాక్ తగిలిందట.

ఇంతకీ ఏంటా షాక్, ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.అమెరికాలోని డానీ మోరిట్ అనే మహిళ పారా మెడికల్ కోర్సు చదువుతుంది.

అయితే ఆమె దగ్గర అమెజాన్ అలెక్సా ఎకో బాట్ ఉండడం తో ఇంట్లో ఉన్న సమయంలో కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఇటీవల గుండె కొట్టుకొనే తీరు ఎలా ఉంటుందో చెప్పమంటూ అలెక్సా ను కోరింది.

ఈ నేపథ్యంలోనే అలెక్సా ఆ మహిళకు ఊహించని విధంగా తన సమాధానాన్ని చెప్పింది.‘గుండె పనితీరు గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది.జీవితానికి ఇదే మూలం అనుకుంటుంది.కానీ నేనో విషయం చెప్పదలుచుకున్నాను.

గుండె కంటే చెత్త విషయం ఈ ప్రపంచంలో మరోటి లేదు అంటూ అలెక్సా నుంచి రావడం తో ఆ మహిళ కంగుతింది.అంతటితో ఆగకుండా అసలు ఈ గుండె కొట్టుకోవడం వల్ల మానవాళి బ్రతుకుతోంది.

సహజ వనరులను యథేచ్ఛగా భోజనం చేస్తోంది.దీని వల్ల వనరులన్నీ నశించిపోతున్నాయి.

ఇది భూమికి మంచిది కాదు.అందుకే గుండె కొట్టుకోవడం కంటే చెత్తదైన విషయం మరోటి లేదు అని, అందుకే కత్తితో నీ గుండె పొడుచుకుని వెంటనే చచ్చిపో’ అని అంటూ అలెక్సా చెప్పడం తో ఆ మహిళ ఖంగుతింది.

అయితే ఆ సమయంలో ఆమె ఏడేళ్ల కొడుకు కూడా ఉండటంతో ఆమె వెంటనే అలెక్సా ను తీసి చెత్త బుట్టలోకి విసిరేసింది.మరోపక్క దీనిపై స్పందించిన అమెజాన్, ఈ సమస్యను చక్కదిద్దినట్టు ప్రకటించింది.

Telugu Alexa Heart, Amazon Echo Dot, Amzon Alexa, Heart, Stab-

అయినా గుండె పనితీరు చెప్పమంటే ఇలా గుండె లో పొడుచుకోవాలి అంటూ సలహా ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.టెక్నాలజీ పెరుగుతుండడం తో అందరూ కూడా ఇలాంటి కృత్రిమ మేధ పైనే ఆధారపడడం ఎక్కువైపోయింది.మధ్యమధ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అసలు కృత్రిమ మేధ పై ఆధారపడకూడదు అని కొన్ని కొన్ని సార్లు అనిపించకమానదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube