అలర్ట్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు !

ఏపీ వాసులని విపత్తులశాఖ అప్రమత్తం చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు విశాఖ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మధ్య తీారం దాటుతుందని అధికారులు అంచనా వేసి చెప్తున్నారు.

 Ap, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasam, Air-TeluguStop.com

ఐఎండీ సూచనలు ప్రకారం.వాయుగుండం ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఇక రాష్ట్రంలో మిగిలిన పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అలాగే వాయుగుండం తీరం దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయి అని చెప్పారు.

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని.

దీనితో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.ఇటు వాయుగుండం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube