Women Cancer : మహిళలకు అలర్ట్.. శానిటరీ ప్యాడ్స్‌ వినియోగంతో క్యాన్సర్, సంతాన లేమి సమస్యలు

రజస్వల అయిన తర్వాత అమ్మాయిలు శానిటరీ ప్యాడ్‌లను వినియోగించడం మొదలు పెడతారు.ఆ తర్వాత పెళ్లైనా కూడా తమకు నెలసరి ఆగిపోయేంత వరకు వాటిని వాడుతుంటారు.

 Alert For Women Cancer And Childlessness Problems With The Use Of Sanitary Pads-TeluguStop.com

భారతదేశంలో ప్రతి నలుగురు మహిళలలో ముగ్గురు ఈ శానిటరీ ప్యాడ్స్ వినియోగిస్తున్నారు. శానిటరీ ప్యాడ్‌లు పర్యావరణానికి శాపంగా ఉన్నాయని తరచుగా మనం వింటున్నాం.

అయితే ఇటీవల ఓ పరిశోధనలో కీలక విషయాలు బయట పడ్డాయి.శానిటరీ ప్యాడ్స్‌లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది.

ఫలితంగా వాటి వల్ల స్త్రీలకు క్యాన్సర్, సంతాన లేమి సమస్యలు వస్తాయని అధ్యయనం వెల్లడంచింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Latest, Sanitari Pads-Latest News - Telugu

నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO) నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, శానిటరీ ప్యాడ్‌లో ఉండే కొన్ని రసాయనాలు మహిళలకు తీవ్రంగా హాని కలిగిస్తాయి.టాక్సిక్ లింక్స్ అనే NGO ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.వారి అధ్యయనంలో భారత దేశంలో విక్రయిస్తున్న శానిటరీ ప్యాడ్‌లలో క్యాన్సర్ కారకాలు, పునరుత్పత్తి టాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్, అలర్జీలు కలిగించే రసాయనాలు ఉన్నాయని తేలింది.ఇవి మహిళల ఆరోగ్యానికి చాలా హానికరమని వెల్లడించింది.

భారత దేశంలో శానిటరీ ప్యాడ్స్ తయారీకి, అందులో అనుసరించాల్సిన విధానాలకు ఖచ్చితమైన నిబంధనలు ఏవీ లేవు.అయితే బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలలో నిబంధనలు కఠినంగా ఉంటాయి.

ఏ మాత్రం హానికరమైన రసాయనాలు ఉన్నా, ఆ ఉత్పత్తులను అక్కడ నిషేధిస్తారు.అయితే భారతదేశంలో ఆ పరిస్థితి లేదు.

దీంతో మన దేశంలో విక్రయించబడుతున్న కంపెనీలకు చెందిన శానిటరీ ప్యాడ్స్‌లో రసాయనాలు అమ్మాయిలు, మహిళ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని తేలింది.దీంతో వీటి వాడకం బాగా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

విరివిగా వాడడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube