గూగుల్ ఫోటోస్ లో స్టోరేజ్ చేసుకునేవారికి అలర్ట్..!

చాలా మంది తమ ఫోటోలు దాచుకోవడానికి గూగుల్ ను వినియోగిస్తుంటారు.గూగుల్ ఫోటోస్ యాప్ లో తమ జీవితంలో జరిగిన మధుర క్షణాలను, అనుభూతులను ఫోటోలో భద్రపరిచి గూగుల్ ఫోటోస్ లో దాచుకుంటుంటారు.

 Alert For Those Who Store In Google Photos ..! Google Photos, Storage, Alert,15m-TeluguStop.com

అయితే ఇలా ఫోటోలు దాచుకున్నవారికి ఓ షాకింగ్ న్యూస్.జూన్‌ నుంచి అన్‌లిమిటెడ్‌ స్టోరేజీని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

అయితే 15 జీబీల వరకు మాత్రమే ఫోటోస్ స్టోరేజీ చేసుకోవాలని సూచించింది.ఒకవేళ మీకు ఎక్కువ స్టోరేజీ కావాలంటే దానికి డబ్బులు చెల్లించాల్సిందే.

ఈ ప్రకటనతో చాలా మంది ఢీలా పడిపోయారు.తమ ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అలర్ట్ అయ్యారు.

గూగుల్‌ స్టోరేజీలో ఎక్కువగా ఫోటోలు ఉంటే తొలగించడమో లేక సేవ్‌ చేసుకోవడమో చేయాల్సిందే.లేకపోతే జూన్‌ తర్వాత పరిమితికి మించి స్టోరేజీ ఉంటే డిలీట్‌ అయిపోతాయి.

ఈ టైంలో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.జూన్‌ 1లోపు నాణ్యతతో ఉన్న ఫోటోలను బ్యాకప్‌ చేయండి.మీ బ్యాకప్‌ నాణ్యతను తనిఖీ చేయడానికి ముందుగా గూగుల్‌ ఫోటోస్‌లోకి వెళ్లి ఫ్రోఫైల్‌పై క్లిక్‌ చేయాలి.తర్వాత ఫోటో సెట్టింగ్‌లోకి వెళ్లి బ్యాకప్‌కు వెళ్లి అప్‌లోడ్‌ స్టోరేజీ చూసుకోవాల్సి ఉంటుంది.

అందులో 15GB కన్నా ఎక్కువ స్టోరేజీ ఉంటే క్వాలిటీ ఫోటోలను సేవ్‌ చేసుకోవడం మంచిది.అధికంగా స్టోరేజీ కావాలనుకునే వారికి మరో ఆప్షన్లు ఉన్నాయి.

డూప్లికేట్ ఫోటోలు, బ్లర్ అయినవి, క్వాలిటీ సరిగా లేని వాటిని డిలీట్ చేసుకోవడం ద్వారా స్టోరేజీని ఎక్కువగా వాడుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Telugu Google, Google Storage, Storage-Latest News - Telugu

లేక పోతే మీ ఫోన్ స్లో కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు.అయితే ఇలాంటి అనవసర ఫోటోలను గుర్తించడానికి కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.డూప్లికేట్స్ క్లీనర్, ఫైల్స్ బై గూగుల్, సీ క్లీనర్, రెమో డూప్లికేట్ ఫోటో రిమూవర్ వంటి వాటితో మీరు అనవసర ఫోటోలను గుర్తించొచ్చు.

వీటి సహాయంతో డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు.డూప్లికేట్, సిమిలర్ ఫోటోలను ఇది గుర్తిస్తుంది.వీటి నుంచి అవసరం లేని ఫోటోలను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube