స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కస్టమర్లకు అలెర్ట్...!

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తమ ఖాతాదారులకు తాజాగా ఒక సూచన చేసింది.ఇక మీదట స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో కొత్త సేవలను అప్డేట్ చేసే పనిలో పడింది.

 Alert For State Bank Of India Customers ... Sbi, Bank, Customer, Alert, Services-TeluguStop.com

ఈ క్రమంలోనే కొన్ని సేవలకు కొన్ని గంటలపాటు అంతరాయం కలగనుందని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రకటించింది.కావున స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్నీ గమనించగలరు.

ఇందులో భాగంగా ఈనెల సెప్టెంబర్ 16న ఒక రెండు గంటలు పాటు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతున్నాయి.సెప్టెంబర్ 16 న 00:00 గంటల నుంచి 02:00 గంటల మధ్య ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ లో కొన్ని సరికొత్త మార్పులు చేయనున్నట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ షేర్ చేసింది.

ఈ రెండు గంటల పాటు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.తమ ఖాతాదారులకు అత్యంత మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలోనే సిస్టమ్‌ ను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అప్డేట్‌ చేస్తోంది.

ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌ సేవలు ఈరోజు రెండు గంటల పాటు పని చేయవని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.అందుకనే ఎవరయినా ఈ రెండు గంటల సమయంలో మనీ ట్రాన్సఫర్ చేయడం కుదరదు కాబట్టి ఖాతాదారులు ఈ విషయాన్నీ ముందుగా గుర్తించి ముందుగానే ఆన్లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోండి.

అయితే గతంలో కూడా సెప్టెంబర్‌ 4, 5 తేదీల మధ్య ఇలాగే మూడు గంటలపాటు అన్ని డిజిటల్‌ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది.

Telugu Bank, Latest-Latest News - Telugu

మళ్ళీ ఈ నెలలో ఇలా ప్రకటన చేయడం ఇది రెండవసారి కావడం గమనార్హం.తమ కస్టమర్లు కోసం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగ్గా పనిచేయడం కోసం ఇలా బ్యాంకులు ఉన్నటుండి సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది.ఖాతాదారులకు ఎటువంటి అంతరాయం, అసౌకర్యం కలగకుండా ఉండడానికీ కొన్ని కొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టడమే బ్యాంకింగ్ రంగాల ముఖ్య ఉద్దేశ్యం.

అయితే ఈ క్రమంలోనే సిస్టమ్ అప్డేట్ చేసే సమయంలో కొన్ని గంటల పాటు ఆన్లైన్ సేవలు నిలిపివేయబడతాయి.ఈ విషయాన్ని కస్టమర్లు గమనించి బ్యాంక్ సిబ్బందికి సహకరించాలని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కోరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube