అలర్ట్: అలాంటి మెస్సేజ్ వస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీయే..!

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి.సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

 Alert Be Aware Of These Type Of Fraud Messages To Your Phone, Bank Alert, Messag-TeluguStop.com

దీంతో చీటింగ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.కొత్త కొత్త రీతుల్లో చీటింగ్ కు పాల్పడుతున్నారు.

ఇప్పటి దాాకా చూస్తే స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌ టాప్‌ ను తమ గుప్పెట్లోకి పెట్టుకోని టీమ్‌ వ్యూయర్‌, ఎనీడెస్క్‌, క్విక్‌ సపోర్టు యాప్‌ లను డౌన్లోడ్ చేయించేవారు.ఆ తర్వాత యూపీఐ ఐడీ లేదా క్యూఆర్‌ కోడ్‌ తో పేమెంట్లు చేసి దోచుకునేవారు.

పోలీసులు అలర్ట్ అవ్వడంతో ఈ నేరాలు చాలా వరకూ తగ్గాయి.దీంతో సైబర్ నేరగాళ్లు కొత్తదార్లు వెతుక్కున్నారు.

రిమోట్‌ యాక్సెస్ ట్రోజన్ అంటే ఆర్‌ఏటీ ర్యాట్‌ ద్వారా ముందుగా ఫోన్ కు ఓ లింకును పంపించేలా చేస్తారు.ఆ తర్వాత దానిపైన క్లిక్ చేసేవిధంగా మాటలతో నమ్మిస్తారు.

ఇక చాలనుకుని అకౌంట్లో ఉన్న డబ్బులను లేకుండా చేసేస్తారు.

రిమోట్‌ యాక్సెసింగ్‌ టూల్‌ అంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ద్వారా సైబర్ నేరగాల్లు ఒక లింక్‌ ను తయారు చేస్తారు.

దానిని బల్క్‌ ఎస్ఎంఎస్ రూపంగా స్మార్ట్ ఫోన్లకు పంపించి ఎస్బీఐ నుంచి పంపుతున్నట్టుగా తెలుపుతారు.ఆ తర్వాత కేవైసీ అప్డేట్‌ చేసుకోకపోతే మీ ఖాతా ఇంకో 6 గంటల్లో ఖాతా క్లోజ్ అయిపోతుందని హెచ్చరిక చేస్తారు.

కేవైసీ అప్లోడ్‌ లేకపోతే ఐటీ నిఘా ఉంటుందని చెబుతారు.

Telugu Bank, Bulk Messages, Latest, Messages, Empty, Remoteaccess-Latest News -

వారు చెప్పిన విధంగానే లింక్‌ పై క్లిక్ చేస్తే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌ సైట్‌ మాదిరిగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది.దాంట్లో తమ సమాచారం పెడితే ఆన్‌లైన్‌ ద్వారా పెమెంట్లన్నీ చేసేస్తారు.ఇటువంటి మోసాలు జరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరించారు.

ఇలాంటి కేసులకు సంబంధించి ఈ మధ్యనే 10 ఫిర్యాదులు అందినట్లు తెలియజేశారు.ఇలాంటి నేరాళ్లకు పాల్పడేవారు జార్ఖండ్‌ జామ్‌తారా, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం వారిని పట్టుకునే వేటలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube