ప్రస్తుత కాలంలో కొందరు మద్యానికి బానిసలై మద్యం సేవించిన సమయంలో విచక్షణ కోల్పోయి చేసేటటువంటి పనుల కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా నలుగురు వ్యక్తులు కలిసి ఫుల్లుగా మద్యం సేవించి పార్టీ చేసుకుంటుండగా బిర్యానీ విషయంలో గొడవ జరగడంతో మణికంఠ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంత పట్టణంలో మణికంఠ అనే యువకుడు నివాసం ఉండేవాడు.అయితే మణికంఠ అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఉండేవాడు.కాగా తాజాగా మణికంఠ మరియు అతడి మరో ముగ్గురు స్నేహితులు కలిసి తన ఇంట్లో మద్యం సేవించారు.
ఇందులో భాగంగా తినడానికి తెచ్చినట్టు వంటి చికెన్ బిర్యాని మొత్తాన్ని మరో ఇద్దరు స్నేహితులు తినేయడంతో మణికంఠ ఎందుకు ఇలా చేశారంటూ గొడవ పడ్డాడు.
ఈ గొడవలో మాట మాట పెరిగి ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి మణికంఠ పై దారుణంగా మద్యం బాటిళ్లను పగలకొట్టి దాడి చేశారు.దీంతో తీవ్ర రక్త స్రావానికి గురయినటువంటి మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మద్యం మత్తు దిగిన తర్వాత నిందితులు మద్యం మత్తులో తామే ఈ నేరం చేసినట్లు అంగీకరించారు.