ఆ శానిటైజర్లతో ఫోన్లను శుభ్రపరుస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త....?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.వైరస్ విజృంభణ వల్ల శానిటైజర్ల వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది.

 Dont Use Alcohal Sanitizers For Mobile Phones, Sanitizers, Mobile Phones, Alcoha-TeluguStop.com

వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంలో చాలా మంది హ్యాండ్ శానిటైజర్ల ద్వారా తరచూ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు.వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే కొందరు శానిటైజర్ల సహాయంతో ఫోన్లను, ఇతర వస్తువులను కూడా శుభ్రం చేస్తున్నారు.

మరి శానిటైజర్ల సహాయంతో ఫోన్లను శుభ్రం చేయవచ్చా….? అనే ప్రశ్నకు నిపుణుల నుంచి ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.ఆల్కహాల్ శానిటైజర్లతో ఫోన్లను శుభ్రం చేయడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతరులు ఫోన్ ను తాకితే ఫోన్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో తరచూ ఫోన్ ను శుభ్రం చేసే వారి సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.

ఆల్కహాల్ శానిటైజర్లతో ఫోన్లను శుభ్రం చేస్తే ఫోన్ డిస్ ప్లే డ్యామేజ్ కావడంతో పాటు డిస్ ప్లే రంగు మారిపోతుంది.

శానిటైజర్లతో శుభ్రం చేసిన ఫోన్లు షార్ట్ సర్క్యూట్ కు కూడా గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.అందువల్ల నిపుణులు ఫోన్లను శానిటైజర్లను ఉపయోగించడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు.

ఆల్కహాల్ ఉండే వైప్స్ ను వినియోగిస్తే ఫోన్ పై ఉండే వైరస్ నశించడంతో పాటు వైప్స్ ఇతరులకు సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

అయితే కొన్ని ఫోన్ల డిస్ ప్లేలను మాత్రమే ఆల్కహాల్ వైప్స్ సహాయంతో శుభ్రం చేసుకోవడం సాధ్యమవుతుందని… ఫోన్ కస్టమర్ కేర్ ను సంప్రదించి తరువాతే ఫోన్లను ఆల్కహాల్ వైప్స్ తో శుభ్రం చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube