డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను చెరువులో తోసేసిన కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే..?

ఓ కొడుకు మద్యానికి బానిసై( Alcohol Addicted ) పని పాట లేకుండా జులాయి గా తిరుగుతూ.మద్యం తాగేందుకు తల్లిదండ్రులు ( Parents ) డబ్బులు ఇవ్వకపోవడంతో సమీపంలోని చెరువులో తోసేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో( Kamareddy ) చోటుచేసుకుంది.

 Alcohol Addicted Son Throw Parents Into Pond In Kamareddy Details, Alcohol Addic-TeluguStop.com

పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి లోని విద్యానగర్ కాలనీలో మహమ్మద్ సలీం, రేష్మ బేగం దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు ఖలీం, ముగ్గురు కుమార్తెలు సంతానం.

ఈ దంపతులు తమ నలుగురు పిల్లలకు తాహతకు తగ్గట్టు వివాహం జరిపించారు.కూతుర్లు పెళ్లి చేసుకుని అత్తవారింట్లో సంతోషంగా ఉన్నారు.

కానీ కుమారుడు ఖలీమ్ ఎటువంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరిగేవాడు.

ఖలీం లో మార్పు రాదని గ్రహించిన భార్య విడాకులు ( Divorce ) ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది.ఖలీం తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు.అయితే ఇటీవల తాను దుబాయ్ కి వెళ్తానని డబ్బులు కావాలని తల్లిదండ్రులకు, ఖలీం తెలిపాడు.

తమ వద్ద లేవు అనడంతో తనను ఎందుకు కన్నారంటూ నిత్యం తల్లిదండ్రులపై చేయి చేసుకోవడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో శుక్రవారం డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని, తాము ముగ్గురం ఆత్మహత్య చేసుకుందామని బలవంతంగా తల్లిదండ్రులను కామారెడ్డి పెద్ద చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.ముగ్గురు నీటిలోకి దిగాక ఖలీం ఒక్కసారిగా తల్లిదండ్రులను నీటి లోపలికి తోసేశాడు.సలీం (55) నీటిలో మునిగిపోయాడు.

రేష్మ బేగం పడిన ప్రాంతంలో లోతు తక్కువగా ఉండడంతో నీటిపైకి వచ్చింది.మళ్లీ ఖలీం తన తల్లిని లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో విషయం తెలిసిన అల్లుడు ఆటోలో వచ్చి సలీం, రేష్మా బేగంలను ఆస్పత్రికి తరలించాడు.

కానీ సలీం అప్పటికే మృతి చెందగా.రేష్మ బేగం ప్రాణాలతో బయటపడింది.

రేష్మ బేగం ఇచ్చిన ఫిర్యాదుతో ప కొడుకు ఖలీమ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube