మందు బాబుల కష్టాలు.. వారికి లాభాలు

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో దేశంలోని అన్ని బార్స్‌ ఇంకా వైన్స్‌ మూత పడ్డ విషయం తెల్సిందే.వైన్స్‌ మూత పడటంతో మందు బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

 Alchol Black Sales Rate Are To Much High In Telangana, Corona Virus, India Lock-TeluguStop.com

మద్యం దొరక్క కొందరు పిచ్చి వారి మాదిరిగా రోడ్లపై తిరుగుతున్నారు.మరికొందరు ఏకంగా ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి బాట కట్టినట్లుగా చెబుతున్నారు.

ఇక కొందరు మద్యం దొరక్క పోవడంతో చనిపోతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటి సమయంలో కొందరు వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది.

వైన్స్‌ బార్స్‌ క్లోజ్‌ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా మద్యం బయటకు రావడమో లేదంటే అంతకు ముందే కొనుగోలు చేసి పెట్టుకున్న మందు ఉండటమో కొందరికి లాభాలు తెచ్చి పెడుతోంది.

ఒక మద్య తరహా ఫుల్‌ బాటిల్‌ 600 రూపాయలు ఉంటే ప్రస్తుతం దాని ధర కాస్త అటు ఇటుగా నాలుగు వేల రూపాయలు పలుకుతోంది.

హాఫ్‌ కావాలంటే రెండు వేలు కొట్టాల్సిందే. మందు లేక అల్లాడి పోయే వారు అంత మొత్తం కూడా పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ పట్టుకుంటూ ఉన్నా కూడా మందు మాత్రం అక్కడక్కడ వారి కళ్లు కప్పి సరఫరా అవుతూనే ఉంది.ఈ సమయంలో మందు ఒక పది ఫుల్‌ బాటిల్స్‌ ఉంటే వేలకు వేలు సంపాదించొచ్చు అంటూ ఒక వ్యక్తి అనడం నాకు ఆశ్చర్యంను కలిగించింది.

మందు కోసం ఇంతగా పరితపిస్తారా అనే అనుమానం కూడా నాకు కలిగింది.మొత్తానికి లాక్‌ డౌన్‌తో మందు బాబులకు కష్టాలు మందు దాచిన వారికి మాత్రం లాభాలు అన్నట్లుగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube