దేవాలయం వద్ద కోనేరు ఎందుకు ఉంటుందో తెలుసా?  

మనం ఏ పుణ్యక్షేత్రం వెళ్లిన అక్కడ కోనేరు ఉండటాన్ని గమనిస్తాం.దాదాపుగపాత దేవాలయాలలో తప్పనిసరిగా కోనేరు ఉంటుంది.ఈ మధ్య కాలంలో కట్టిదేవాలయాలలో కోనేరు కనపడటం లేదు.ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఎక్కువగనదులు ప్రవహించే తీరాల్లో నిర్మించబడ్డాయి.కోనేరు,దేవాలయానికి ఏమైనసంబంధం ఉందా… అని ఆలోచిస్తే దానికి కూడా ఒక కారణం కనపడుతుంది.ఇప్పడు కారణం గురించి తెలుసుకుందాం.

Alayalalo Koneru Enduku Untundi--

నీటిని ప్రాణానికి,జీవానికి ప్రతీకగా చెప్పుతారు.దేవాలయాలు ప్రశాంతతకచిహ్నంగా చెప్పుతారు.దేవాలయాలలో చేసే చాలా అంటే ఇంచుమించు ప్రతకార్యక్రమానికి నీరు అవసరం అవుతుంది.దేవలయములో జరిగే మంత్రోచ్చారణల,పుణ్యకార్యాల శక్తిని నీరు నిక్షిప్తము చేసుకుంటుంది.అలాగసంధ్యావందనములకు, పితృకార్యాలకు, అర్ఘ్య పానాదులకు, పుణ్య స్నానాదులకకోనేటిలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది.ఇదివరకు చాలా మంది భక్తులు,యాచకులు,దేవాలయ పరిసరాలలో నివసించే పశపక్ష్యాదుల నీటి అవసరాలకు దేవాలయాల్లో ఉండే కోనేరు నీటి అవసరాలనతీర్చేవి.

కొన్ని దేవాలయాల్లో ఉన్న కోనేరుకి ప్రసాదం సమర్పించే ఆచారకూడా ఉంది.దీని ఉద్దేశం ఏమిటంటే ఆ కోనేటి నీరులో ఉండే జీవులకు ఆహారాన్నఅందించటం.ఏది ఏమైనా మన పెద్దవారు పెట్టిన ఆచార వ్యవహారాల్లో ఏదొపరమార్ధం దాగి ఉంటుంది.