అలస్కా తీరంలో బోటు మునక: ఐదుగురు గల్లంతు

అలస్కాన్ ద్వీపకల్ప తీరంలో మంగళవారం బోటు మునిగిపోయిన ఘటనలో ఐదుగురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది.యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపిన వివరాల ప్రకారం అలస్కా గల్ఫ్‌‌లోని సుత్విక్ ద్వీపం సమీపంలో స్కాండిస్ రోజ్ అనే ఫిషింగ్ బోటు మంగళవారం అర్థరాత్రి మునిగిపోయినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపింది.

 Alaska Crab Boat Sinks-TeluguStop.com
Telugu Telugu Nri Ups-

దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, 15 నుంచి 20 అడుగుల ఎత్తులో వచ్చిన బలమైన అలలు, వెలుతురు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా కోస్ట్ గార్డ్ తెలిపింది.ప్రమాద విషయం తెలియగానే తాము జైహాక్ హెలికాఫ్టర్, హెర్క్యులస్ విమానాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని రక్షించినట్లు కోస్ట్‌ గార్డ్ వెల్లడించింది.

Telugu Telugu Nri Ups-

ఉనలస్కాలోని డచ్ హార్బర్ కేంద్రంగా స్కాండిస్ రోజ్ పనిచేస్తోంది.ఇది బోటు మునిగిన ప్రాంతానికి సుమారు 400 మైళ్లదూరంలో ఉంది.క్రాబింగ్ పరిశ్రమ చారిత్రాత్మకంగా ఎంతో ప్రమాదకరమైనది.వేట సమయంలో క్రూ సిబ్బంది ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.2017లో వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఓ క్రాబింగ్ ఫిష్ సెయింట్ పాల్ తీరం సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో ఆరుగురు సిబ్బంది జలసమాధి అయ్యారు.కాగా తాజా ప్రమాదంలో రక్షించబడిన ఇద్దరిని కోడియాక్ ఆసుపత్రికి తరలించినట్లు కోస్ట్ గార్డ్ 17వ జిల్లా కమాండ్ సెంటర్ డ్యూటీ ఆఫీసర్ లెఫ్టెనెంట్ వేడ్ ఆర్నాల్డ్ మీడియాకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube