అయయ్యో: ఇదెక్కడి గోల.. తల భాగానికి స్కానింగ్ కి వెల్తే.. చివరికి..?!

మనం ఒకళ్ళని కాపాడుదాం అని అనుకుంటే ఒక్కోసారి మనకే ప్రమాదం జరగవచ్చు.అయితే ఆ ప్రమాదాలు అనేవి ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు.

 Alas: The Sphere Of This .. If The Head Goes To Scanning .. In The End ..?! Mri-TeluguStop.com

ఇప్పుడు కుడా పాపం ఒక అతను వేరే వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం ప్రయత్నించే సమయంలో అతనికే ప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో అతని చేయి కట్ అయిపోయింది.

అసలు విషయానికి వస్తే.మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై నగరంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

ముంబైకి చెందిన విక్రమ్ అబ్ నవే అనే వ్యక్తి గత కొంత కాలంగా అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.అయితే శుక్రవారం రోజున ఒక పేషెంట్ ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం అని ముంబైలో ఉన్న ‘ప్రతామ్‌ ఎమ్‌ఆర్‌ఐ అండ్‌ సీటీ స్కాన్‌ సెంటర్‌‘ కు అంబులెన్సులో తీసుకుని వెళ్ళాడు.

అయితే పేషంట్ పరిస్థితి మరి సీరియస్ గా ఉండడంతో ఆక్సిజన్ పెట్టి స్కానింగ్ సెంటర్ కి తీసుకుని వచ్చాడు విక్రమ్.

అక్కడ ఎమ్ఆర్ఐ స్కానింగ్ మెషీన్‌ ఉన్న గదిలోకి పేషంట్ తో పాటు ఆక్సిజన్ సిలెండర్ ను లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్.

ఒక చేత్తో ఆక్సిజన్ సిలిండర్ పట్టుకున్న విక్రమ్ కి మరో చేతికి షాక్ కొట్టినట్లుగా అనిపించింది అంట.విక్రమ్ ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అతని చేయి ఎమ్ఆర్ఐ మెషీన్‌ లోకి వెళ్లిపోయింది. దీంతో విక్రమ్ ఎమ్‌ఆర్‌ఐ మెషీన్‌ లో ఇరుక్కుపోయాడు.ఒక చేతిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పట్టుకోగా, మరో చేయి ఎమ్‌ఆర్‌ఐ మెషిన్ లోపల ఉండిపోయింది.

Telugu Hand, Mri Scan, Latest-Latest News - Telugu

వెంటనే అప్రమత్తం అయిన విక్రమ్ తన చేతిని గట్టిగా మెషీన్ లో నుంచి వెనక్కి లాక్కుని వెంటనే ఎమ్‌ఆర్‌ఐ రూములో నుంచి బయటకు పరిగెత్తుకుని వచ్చి కేకలు వేసాడు.అయితే ఈ ప్రమాదంలో విక్రమ్ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.స్కానింగ్ సెంటర్ అంతా రక్తంతో తడిచిపోయింది.నొప్పిని తట్టుకోలేక విక్రమ్ కేకలు వేయడంతో ఎమ్ఆర్ఐ సెంటర్ సిబ్బంది వచ్చి వెంటనే విక్రమ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంలో విక్రమ్ చిటికెన వేలు విరిగిపోగా, ఆ వేలుకి డాక్టర్లు రాడ్ వేసి చికిత్స చేసారు.స్కానింగ్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన బట్టి అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube