అయ్య‌య్యో ఎంత ప‌ని అయిపోయింది.. కాలువ‌ను ఇలా కూడా దాటుతారా..?

అంద‌రూ చేసే దారిలోనే ప‌నులు చేస్తే కిక్ ఏముంటుంది అనుకుని చాలామంది ఏదో చేయాల‌నుకుంటారు.కానీ చివ‌ర‌కు ఇంకేదో జ‌రుగుతుంది.

 Alas Can You Cross The Canal Like This Details, Cross The Canal, Viral Video, Vi-TeluguStop.com

అదే వారిని ఇబ్బందుల్లో ప‌డేస్తుంది.ఇలాంటి వీడియోలు నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంటాయి.

ఇలాంటి వార్త‌ల్లో చాలా వ‌ర‌కు ఫన్నీగానే ఉంటాయి.మొన్న‌టికి మొన్న ఓ వ్య‌క్తి హెయిర్‌ను రైస్ కుక్క‌ర్ తో ఆర‌బెట్టుకోవ‌డాన్ని కూడా చూశాం.

ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లు నిత్యం ఏదో ఒక చోట జ‌రుగుతూనే ఉంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.

సాధార‌ణంగా మ‌నం ఏదైనా కాలువ‌ను దాటాలంటే ఏం చేస్తాం.ద‌గ్గ‌ర‌లో ఏదైనా బ్రిడ్జి ఉందో అని చూస్తాం క‌దా.

ఒక వేళ అది బాగా లోతు లేక‌పోతే అందులో నుంచి దాటేందుకు కూడా ట్రై చేస్తుంటాం.కానీ ఇది వెరైటీగా ఆలోచించే వారికి న‌చ్చ‌దు క‌దా.

వారికి అన్నీ వెరైటీగా ఉండాలి.అందుకే ఇప్పుడు కొంద‌రు ఇలా ట్రై చేశారు.

ఇందుకు సంబంధించిన వైర‌ల్ వీడియోలో వారికి ద‌గ్గ‌ర‌లో మంచి బ్రిడ్జి కూడా ఉంది.అయితే దాని నుంచి అవ‌త‌ల‌కు దాట‌డం ఎందుకు అని యువకులు షార్ట్ కట్‌లో అవ‌త‌ల‌కు చేరుకోవాల‌నుకున్నారు.

అవ‌త‌లి వైపు వారి కారు కూడా ఉంది.

అయితే ఇలా కాలువ‌ను దాటేందుకు ఓ యువకుడు ఎగేసుకుంటూ ముందుకు వ‌చ్చాడు.కానీ అక్క‌డే ఓ కిటుకు ఉంది.అయితే అత‌ను ఆ కాలువ‌లో ఉన్న చెట్టు కొమ్మ‌ను ప‌ట్టుకుని దాటేందుకు ప్ర‌య‌త్నించాడు.

చివరి దాకా బాగానే వెళ్లినా కూడా చివ‌ర‌కు వెళ్లే స‌రికి త‌డ‌బ‌డ్డాడు.ఈ ఆగంలో అవ‌త‌లి గ‌ట్టు మీద ఇలా కాలు పెట్టాడో లేదో అమాంతం కాలువ‌లో ప‌డిపోయాడు.

ఇంత క‌ష్ట‌ప‌డి దాటినా.చివ‌ర‌కు కాలువ‌లో ప‌డిపోవ‌డం అంద‌రినీ న‌వ్వులు తెప్పించింది.

ఇదంతా కొంద‌రు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయ‌గా.నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube