అక్కడ అబార్షన్ చేస్తే.. 99 ఏళ్ల జైలు శిక్ష... ఇకపైన అబార్షన్ లే జరగవు..

అబార్షన్ అంటే తల్లి కడుపు నుండి శిశువు బయటకి రాకముందే లోపల ఉన్న పిండాన్ని తీసివేయడం.కొన్ని దేశాల్లో అబార్షన్ చేసుకోవడం చట్టరీత్య అమలులో ఉంటే చాలా దేశాల్లో ఇది నేరం.

 Alabama Abortion Doctors Could Face Up To 99 Years In Jail 9-TeluguStop.com

అభివృద్ధి చెందుతున్న మరియు వెనక బడి ఉన్న దేశాల్లో లోపల ఉన్న శిశువు ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్నారు.ఇవి ఇలా ఉంటే కొన్ని సార్లు అమ్మాయిలు రేప్ కి గురి కావడం వల్లనో , ఇష్టం లేని శృంగారం లో పాల్గొనడం వల్లనో గర్భం దాలుస్తున్నారు.

అయితే అలాంటి వాటి వల్ల గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవడం లో తప్పు లేదు.కానీ అమెరికాలో అబార్షన్ గురించి ఒక చట్టం తీసుకొచ్చింది.

ఒకవేళ ఎవరికైనా అబార్షన్ చేస్తే అబార్షన్ చేసిన డాక్టర్ కి 99 ఏళ్ల జైలు శిక్ష వేస్తారంట.అసలు విషయానికి వెళ్తే.

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఇక పైన అబార్షన్ అనే పదమే వినపడదు , ఎవరైనా అబార్షన్ చేయడానికి పాల్పడితే వారికి జీవితంత జైలు శిక్షే.ఎందుకంటే, అబార్షన్‌ను నిషేధిస్తూ అక్కడి సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ వివాదాస్పద బిల్లును చర్చల అనంతరం సభ ఆమోదించింది.ఈ బిల్లును ఎంత కఠినంగా రూపొందించారంటే రేప్ బాధితులకు, వావి వరుసలు లేకుండా చేసే తప్పుల(ఇన్‌సెస్ట్) వల్ల వచ్చే గర్భాన్ని కూడా తొలగించుకోవడానికి అనుమతి లేదు.

కేవలం తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితేనే అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఉంది.కాదని డాక్టర్లు అబార్షన్ చేస్తే 99 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు.25-6 ఓట్ల తేడాతో పాస్ అయిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు.ఆమె బిల్లుకు ఆమోదం తెలిపి చట్టం చేశారు.

నిజానికి, 1973లో అమెరికన్ సుప్రీం కోర్టు అబార్షన్లను దేశవ్యాప్తంగా చట్టబద్దం చేసింది.అయితే కోర్టు తీర్పును సమీక్షించిన సెనేట్, దానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో విచ్చల విడిగా జరుగుతున్న అబార్షన్లపై దేశవ్యాప్తంగా మహిళలు, స్వచ్ఛంద సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథయంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అక్కడ అబార్షన్ చేస్తే 99 ఏళ్ల �

కొన్ని సార్లు రేప్ కి గురికావడమో లేక బలవంతపు శృంగారం వల్ల గర్భం దాలచవచ్చు అటువంటి వాటికి మినహాయింపు ఇవ్వమని డెమోక్రాట్లు పట్టుబట్టినా ఆ సవరణ 11-21 ఓట్ల తేడాతో వీగిపోయింది.ఈ బిల్లును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.అత్యాచార బాధితులు గర్భస్రావం చేయించుకునేందుకు వీల్లేదనడం వారిని మరింతగా శిక్షించినట్లవుతుందని విరుచుకుపడుతున్నారు.

కాగా, అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.అయితే, ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాలంటే ట్రంప్ అనేక స‌వాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ప్రస్తుత సుప్రీంకోర్టు ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నది.తొమ్మిది మంది స‌భ్యులు ఉండే సుప్రీంలో.ట్రంప్ నియ‌మించిన కన్జర్వేటివ్ జ‌డ్జిలు ఎక్కువే ఉన్నారు.1973 నాటి తీర్పును ర‌ద్దు చేయాల‌న్న ఉద్దేశంతో కన్జర్వేటివ్‌లు ఉన్నారు.దీంతో ఇప్పుడు అల‌బామాలో అబార్షన్‌పై నిషేధం విధించ‌డం ఓ సంచ‌ల‌నంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube