నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాడు.దాదాపు ఏడాది కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు.2019 సంవత్సరంలో ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయిన బన్నీ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు బన్నీల కాంబోలో ఇప్పటికే జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక ఈ చిత్రం హ్యాట్రిక్ అవ్వడం ఖాయం అనుకుంటున్నారు.మరి హ్యాట్రిక్ కొట్టారా లేదంటే ఫలితం తారు మారు అయ్యిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వాల్మీకి మిడిల్ క్లాస్ వ్యక్తి కాగా, రామచంద్ర బాగా డబ్బున్న వ్యక్తి కంపెనీలకు అధిపతి.వీరిద్దరి కొడుకులు మారిపోతారు.
ధనవంతుడి కొడుకు అయినా కూడా వాల్మీకి వద్ద ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రాడిగా పెరుగుతాడు.ఇక వాల్మీకి కొడుకు ధనవంతుడిగా రామచంద్ర వద్ద పెరుగుతాడు.
మిడిల్ క్లాస్ కుర్రాడిగా బన్నీ చాలా కష్టాలు పడుతాడు.చివరకు ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.
ఆ సమయంలో బన్నీ తన ఒరిజినల్ తండ్రి ఇల్లు వైకుంఠపురంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అక్కడ అడుగు పెడతాడు.ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ధనవంతుడైన బన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎందుకు పెరిగాడు అనేది కథాంశం.
నటీనటుల నటన :
అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రను బాగా చేశాడు.ఒక విభిన్నమైన మ్యానరిజంతో బన్నీ ఆకట్టుకున్నాడు.డాన్స్‌లు మరియు ఫైట్స్‌తో దుమ్ము రేపాడు.ఇక హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్‌లో కూడా మెప్పించాడు.కొన్ని సీన్స్‌లో మామయ్య చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా నటించాడు.మొత్తానికి వైకుంఠపురం మొత్తం బన్నీ బుజాలపై నడిచింది.
హీరోయిన్ పూజా హెగ్డేకు చాలా తక్కువ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.ఆమె ఉన్నంతలో పర్వాలేదు అన్నట్లుగా నటించింది.
పాటల్లో మరియు కొన్ని సీన్స్‌లో స్కిన్ షోతో ఆకట్టుకుంది.మురళి శర్మ మరియు జయరామ్‌లు మంచి నటన కనబర్చారు.
తమిళ నటుడు సముద్రఖని విభిన్నమైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు.సునీల్ కామెడీ సో సోగానే ఉంది.ఇక ఇతర పాత్రల్లో నటించిన వారు పర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ :
సినిమా విడుదలకు ముందే థమన్ సంగీతం సూపర్ హిట్ అయ్యింది.పాటలు దాదాపుగా అన్ని కూడా ముందే తెగ విని ఉంటాం కనుక సినిమా చూస్తున్న సమయంలో మరింతగా కనెక్ట్ అవుతున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టాడు.
సినిమాటోగ్రఫీ బాగుంది.సినిమాను చాలా రిచ్ లుక్‌లో చూపించడంలో సినిమాటోగ్రపీ కీలకంగా పని చేసింది.
ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి.ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సీన్స్‌ను ట్రిమ్ చేయాల్సింది.
దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే విషయంలో మూస పద్దతినే వాడాడు.ఇంకాస్త కొత్తగా ట్రై చేసి కొత్తగా ఎంటర్‌టైన్ చేయాల్సింది.
నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో కూడా హీరో ఆదర్శవంతమైన కొడుకుగా కనిపిస్తాడు.అయితే సినిమా చూస్తున్నంత సేపు త్రివిక్రమ్ గతంలో చేసిన ఏదో ఒక సినిమాలోని సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.కథ చదివారు కదా అజ్ఞాతవాసికి కాస్త అటు ఇటుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా.కాని కథ విభిన్నంగా ఉంటుంది.అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆ విధంగానే సాగుతుంది.
అల్లు అర్జున్‌ను ఎంటర్‌టైనర్ జోనర్‌లో చూపించాలని త్రివిక్రమ్ చేసిన ప్లాన్ ఇది.కథ చాలా చిన్న పాయింట్.దాన్ని ఎలాబ్రేట్ చేయడంలో దర్శకుడు త్రివిక్రమ్ విఫలం అయినట్లుగా అనిపించింది.స్క్రీన్‌ప్లే విషయంలో కూడా ఇంకాస్త బెటర్‌గా చేస్తే బాగుండేది.ఒక సాదా సీదా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉన్నా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్‌పాయింట్స్ :
అల్లు అర్జున్, పూజా హెగ్డేల రొమాన్స్, పాటలు, సినిమాటోగ్రఫీ, కొన్ని డైలాగ్స్, స్టోరీలో ట్విస్ట్, స్టోరీ లైన్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్,సెకండ్ హాఫ్, త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిక
బోటమ్ లైన్ : అల వైకుంఠపురంలో బాగానే ఉంది కానీ ఎక్కడో చూసినట్లుంది.