అల వైకుంఠపురంలో కాస్తా సెహజాదా అయ్యింది

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా అల వైకుంఠపురంలో.ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా పూజా హెగ్డే నటించింది.

 Ala Vaikunthapurramuloo Hindi Remake Title Fixed-TeluguStop.com

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు.

ఇదిలా ఉంటే ఈ మూవీని ప్రస్తుతం అల్లు అరవింద్, ఏక్తా కపూర్ సంయుక్తంగా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.కార్తిక్ ఆర్యాన్, కృతి సనన్ ఈ మూవీలో జోడీగా కనిపించబోతున్నారు.

 Ala Vaikunthapurramuloo Hindi Remake Title Fixed-అల వైకుంఠపురంలో కాస్తా సెహజాదా అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.ప్రస్తుతం మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు క్యాస్టింగ్ సెలక్షన్ జరుగుతుంది.

ఇక తెలుగులో టబు చేసిన పాత్ర కోసం హిందీలో మనిషా కోయిరాలని తీసుకున్నారు.ఇక అల్లు అర్జున్ తండ్రిగా మురళీశర్మ చేసిన పాత్రలో హిందీ కోసం పరేష్ రావాల్ ని ఫైనల్ చేశారు.

ప్రధాన పాత్రల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని సమాచారం.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి తాజాగా టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.సెహజాదా అనే టైటిల్ ని ఈ రీమేక్ మూవీకి ఫిక్స్ చేసినట్లు సమాచారం.జులైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కృతి సనన్ ఆది పురుష్ సినిమా షూటింగ్ లో జులైలో పాల్గొంటుంది.అక్కడ కంప్లీట్ చేసుకొని ఈ మూవీ కోసం జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

#Rohit Dhawan #Allu Arjun #Kriti Sanon #Karthi Aryan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు