అల వైకుంఠపురములో అర్జున్ రెడ్డి.. పార్ట్ 2!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు.

 Ala Vaikunthapurramuloo Deleted Scene Released-TeluguStop.com

బన్నీ స్టైలిష్ యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, థమన్ అదిరిపోయే మ్యూజిక్ కలగలిసి ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాయి.ఇక ఈ సినిమాను ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమా తన తడాఖా చూపిస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సీన్‌లో సుశాంత్‌కు సంబంధించిన సీక్రెట్‌ను బన్నీ తెలుసుకుని, అతడికి ఆటపట్టించడం మనకు కనిపిస్తుంది.

ఈ సీన్‌లో అర్జున్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడంతో ఈ సీన్ చాలా ఆసక్తికరంగా మారింది.ఈ సన్నివేశాన్ని సినిమా నుండి ఎందుకు తొలగించారో అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తు్న్నారు.

మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్ ప్రస్తుం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఈ సీన్‌ను మీరు ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube