ఆగినచోటే మొదలుపెడుతున్న థియేటర్లు

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా గడగడలాడిస్తుందో అందరికీ తెలిసిందే.చైనాలో పుట్టిన ఈ వైరస్ దెబ్బకు దాదాపు ఆర్నెళ్లకు పైగా యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.

 Ala Vaikunthapuramuloo Re Releasing In Telugu States, Ala Vaikunthapuramuloo, Al-TeluguStop.com

ఈ దెబ్బతో అన్ని రంగాలకు చెందిన కార్యకలాపాలు మూతపడ్డాయి.ముఖ్యంగా సినిమా రంగం, థియేటర్లు ఇంకా కొన్ని చోట్ల తెరుచుకోకపోవడంతో ఆయా రంగాలు తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ నుండి కోలుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో, ప్రస్తుతం సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇప్పట్లో కొత్త సినిమాలేవీ రిలీజ్‌కు రెడీగా లేకపోవడంతో థియేటర్లు తెరుచుకోగానే ఏ సినిమాను ప్రదర్శించాలా అని సదరు యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి.అయితే ఈయేడు బ్లాక్‌బస్టర్ మూవీల జాబితాలో నిలిచిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని మరోసారి రి-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి కొత్త సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో థియేటర్ యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్‌లో సీటింగ్ అక్యుపెన్సీ పెరిగితేనే కొత్త సినిమాలను రిలీజ్ చేయాలని చిత్ర వర్గాలు చూస్తున్నాయి.

ఇక అల వైకుంఠపురములో చిత్రానికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టే దసరా సీజన్‌కు కొత్త సినిమాలను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.మరి అల వైకుంఠపురములో చిత్రాన్ని ఇప్పటికే చూసిన ఆడియెన్స్, ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అల వైకుంఠపురములో చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా, సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube