ఒక్క సినిమాలో ఇన్ని మిలియన్‌లా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు వారు పట్టం కట్టారు.

 Ala Vaikunthapuramuloo Five Songs Get 100m Views, Ala Vaikunthapuramuloo, Songs,-TeluguStop.com

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోయే రికార్డులను తెచ్చిపెట్టింది.

సామజవరగమనా పాట నుండి మొదలైన రికార్డులు రాములో రాములా, బుట్ట బొమ్మ వంటి పాటలతో కూడా ముందుకు వెళ్తూ వస్తోంది.

ఈ సినిమాకు థమన్ కెరీర్ బెస్ట్ సంగీతం అందించాడని ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇక ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి.

ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌లతో ఈ చిత్ర పాటలు దుమ్ములేపుతున్నాయి.ఇప్పటికే సామజవరగమనా, రాములో రాములా లిరికల్, వీడియో పాటలు 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోగా, ఇటీవల బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

ఇలా ఒకే సినిమాకు చెందిన 5 వీడియో పాటలు 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం రీజనల్‌గా ఒక రికార్డు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్‌తో పాటు థమన్ అత్యద్భుతమైన సంగీతం తోడవ్వడంతో అల వైకుంఠపురములో చిత్రం అలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube