అల వైకుంఠపురములో కత్తెరకు రెడీ.. పోయేదేమీ లేదంటున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా శనివారం నాడు సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుంది.

 Ala Vaikunthapuramulo To Go For Censor On Saturday-TeluguStop.com

పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ సినిమాలో అన్ని అంశాలు మిలితం చేశారని, బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్, థమన్ సంగీతం ఇలా అన్ని కలిసి ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.

ఇప్పటికే ఈ సినిమా పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ సినిమాను తిలకించేందుకు ఆసక్తి చూస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి.

అటు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube