అల వైకుంఠపురములో సరికొత్త రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

 Ala Vaikunthapuramulo Creates New Record, Ala Vaikunthapuramulo, Allu Arjun, Tri-TeluguStop.com

ఇక ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు జనం ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలోని సామజవరగమనా, రాములో రాములా పాటలు యూట్యూబ్‌ను దడదడలాడించాయి.కాగా తాజాగా బుట్ట బొమ్మా అనే పాట కూడా ఈ సినిమా క్రేజ్‌ను ముందుకు తీసుకెళ్లింది.

తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసింది.ఇక త్వరలోనే ఈ వీడియో మిలియన్ లైకుల మార్క్‌ను కూడా చేరుకోనుంది.

మొత్తానికి అల వైకుంఠపురములో సినిమా ఆన్‌లైన్‌లోకి వచ్చినా కూడా ఈ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదని చెప్పాలి.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube