సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.

 Ala Vaikuntapuramuloo Songs Creates Global Record, Ala Vaikuntapuramuloo, Allu A-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమా మ్యూజికల్ పరంగానూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా కోసం తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాలోని పాటలు విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాయి.ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా పలు రికార్డులను క్రియేట్ చేశాయి.

కాగా తాజాగా ఈ సినిమాలోని రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు గ్లోబల్ రికార్డును క్రియేట్ చేసి తమ సత్తా చాటాయి.

టాప్ 100 గ్లోబల్ మ్యూజిక్ వీడియో పాట్లలో బుట్టబొమ్మ వీడియా సాంగ్ ఏకంగా 17వ ర్యాంకు సాధించగా, రాములో రాములా పాట 94వ స్థానంలో నిలిచింది.

ఇలా ప్రపంచవ్యాప్త రికార్డును క్రియేట్ చేసిన ఈ పాటలు అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమా అందించిన సూపర్ సక్సె్స్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను శరవేగంగా తెరకెక్కించాలని చూస్తుంటే, దర్శకుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసేందుకు రెడీ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube