అల వైకుంఠపురములో ట్రైలర్ టాక్.. త్రివిక్రమ్ మార్క్ ఫుల్ మీల్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్న ఫల్ ప్యాక్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించింది.

 Ala Vaikuntapuramulo Trailer Talk-TeluguStop.com

ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తరహా వేడుకను ఇవ్వాళ నిర్వహిస్తున్నారు.ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.కాగా ఈ వేడుకలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం చూసేసిన భావన కలగక మానదు.

ట్రైలర్ మొదట్లో బన్నీ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయిగా, కేవలం నిజం మాత్రమే మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తాడు.అతడిని పరీక్షించేందుకు టబు తన కంపెనీలో అతడికి ఉద్యోగం ఇస్తుంది.ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అతడు ఎదుర్కొని పరిష్కరించే విధానమే సినిమా కథ అని మనం ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు.

అయితే ట్రైలర్‌లో బన్నీ స్టైల్‌ను ఎక్కడా మిస్ కానివ్వకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడ్డారు.

అటు త్రివిక్రమ్ మాటలు తూటాల్లా మరోసారి ఈ సినిమాలో పేలడం ఖాయమని ట్రైలర చూస్తే తెలుస్తోంది.

‘‘గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్లతోనే’’ అంటూ సాగే డైలాగుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇలాంటి సినిమాలో బోలెడన్నీ ఉన్నాయంటూ చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్‌ ప్రేక్షకులను అలరించడంలో ఎంత సక్సెస్ అయ్యిందో, ఈ చిత్ర ట్రైలర్ అంతకంటే ఎక్కువగా అలరించడం ఖాయం.త్రివిక్రమ్ అజ్ఞాతవాసితో పోగొట్టుకున్న క్రేజ్ రెండింతలు ఈ సినిమాతో తిరిగి పొందుతాడు అనే దానిలో సందేహం ఏమాత్రం లేదు.

ఇక త్రివిక్రమ్ మాయలో పడేందుకు తెలుగు జనాలు సిద్ధం కండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube