అల వైకుంఠపురములో 33 రోజుల కలెక్షన్లు.. టార్గెట్ 160!  

Ala Vaikuntapuramulo 33 Days Collections - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Pooja Hegde, Telugu Movie News, Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గె్స్ట్ హిట్‌ను అందుకున్నాడు.

Ala Vaikuntapuramulo 33 Days Collections

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన త్రివిక్రమ్-బన్నీ ఎలాంటి సినిమాను తెరకెక్కించారో చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.

అటు థమన్ అందించిన మ్యూజిక్ రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఇక రిలీజ్‌ రోజునే ఈ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదిరిపోయే వసూళ్లను సాధించింది.

చాలా తక్కవ సమయంలోనే ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 33 రోజులు ముగిసే సరికి రూ.158.80 కోట్ల మేర షేర్ కలెక్షన్లు సాధించింది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 33 రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 44.30 కోట్లు

సీడెడ్ – 18.13 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.71 కోట్లు

గుంటూరు – 11.05 కోట్లు

ఈస్ట్ – 11.31 కోట్లు

వెస్ట్ – 8.85 కోట్లు

కృష్ణా – 10.67 కోట్లు

నెల్లూరు – 4.66 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 128.68 కోట్లు

కర్ణాటక – 9.18 కోట్లు

కేరళ – 1.17 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు

ఓవర్సీస్ – 18.33 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.158.80 కోట్లు

.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo 33 Days Collections-allu Arjun,pooja Hegde,telugu Movie News,trivikram Related....